ఓ ప్లేట్ సక్సెస్ కావాలని అంటున్న తేజ్! చిత్రలహరి ట్రైలర్  

Chitralahari Movie Trailer Release-

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి కెరియర్ ఆరంభంలో వరుస హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకొని బజ్ లోకి వచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.హ్యాట్రిక్ విజయాల తర్వాత మెగా హీరో బ్యాడ్ లక్ ని వెంటేసుకొని ఏకంగా ఆరు ఫ్లాప్ లని తన ఖాతాలో వేసుకున్నాడు.

Chitralahari Movie Trailer Release- Telugu Tollywood Movie Cinema Film Latest News Chitralahari Movie Trailer Release--Chitralahari Movie Trailer Release-

ఇక కెరియర్ లో వరుస ఫ్లాప్ ల తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.


ఇక చిత్రాల హరి సినిమాని తేజ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలకి భిన్నంగా కమర్షియల్ యాంగిల్ కి దూరంగా ఎమోషనల్ పాయింట్ తో ప్రేక్షకులని కనెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.దర్శకుడు కిషోర్ తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాని కూడా ఎమోషనల్ పాయింట్ తో తెరకెక్కించాడు.

దురదృష్టంని వెంట ఏసుకొని తిరిగే ఓ కుర్రాడి లైఫ్ లో ఏనాటి సమస్యలు ఎదుర్కొన్నాడు.అలాగే కెరియర్, ప్రేమ విషయంలో అతనికి ఎలాంటి దెబ్బలు తగిలాయి అనే విషయాలని ఈ సినిమాలో దర్శకుడు టచ్ చేస్తున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది.

ఆత్మహత్య చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరి లైఫ్ లో బలమైన ఎమోషనల్ కారణాలు ఉంటాయనే విషయాన్ని చిత్రలహరిలో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

.

తాజా వార్తలు

Chitralahari Movie Trailer Release- Related....