'చిత్రలహరి' కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా... డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటీ?  

About Chitralahari Collections-chitralahari,collections,distributors,shares

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ వరుసగా ఆరు ఫ్లాప్‌లు పడటంతో ‘చిత్రలహరి’ చిత్రంతో ఎలాగైనా సక్సెస్‌ దక్కించుకోవాలని ప్రయత్నించాడు. అందుకోసం తన పేరులోని ధరమ్‌ను తీసివేసి సాయి తేజ్‌గా మార్చుకున్నాడు. ఇంకా లుక్‌ను మార్చడంతో పాటు, వెయిట్‌ను కూడా తగ్గించాడు. ఇన్ని ప్రయత్నాలు చేసి నటించిన ‘చిత్రలహరి’ చిత్రం రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ రూపొందింది..

'చిత్రలహరి' కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా... డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటీ?-About Chitralahari Collections

అయితే చిత్రంలో నటించిన హీరో ఫ్లాప్‌ హీరో అవ్వడంతో ఓపెనింగ్స్‌ అంతగా రాలేదు. మొదటి రోజు ఈ చిత్రం 3.62 కోట్ల షేర్‌ను దక్కించుకుంది.

సాయి ధరమ్‌ తేజ్‌కు 3.62 కోట్ల షేర్‌ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో గౌరవ ప్రథమైన సంఖ్యే. అయితే డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్‌ ఈవెన్‌ను పొందాలి అంటే మాత్రం సినిమా ఇంకాస్త జోరు పెంచాల్సిన అవసరం ఉంది. రెండవ రోజుకు చిత్రం 5.5 కోట్ల షేర్‌ను రాబట్టడంతో డిస్ట్రిబ్యూటర్లలో నమ్మకం పెరిగింది. మొదటి మూడు రోజుల్లో పెట్టిన పెట్టుబడిలో సంగం అయినా వస్తుందని వారు భావిస్తున్నారు.

అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం 14 కోట్లకు అమ్ముడు పోయింది. అంటే మొదటి మూడు రోజుల్లో 7 కోట్లకు అటు ఇటుగా షేర్‌ వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇక లాంగ్‌ రన్‌లో మరో ఏడు కోట్లు ఈజీగానే వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతుంది. మొత్తంగా ఈ చిత్రం లాంగ్‌ రన్‌ లో 16 నుండి 17 కోట్ల వరకు వచ్చినా కూడా నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు దక్కడం ఖాయంగా ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. నైజాం ఏరియాలో ఇప్పటికే ఈ చిత్రం కోటి మార్క్‌ను దాటింది. ఆది వారం కావడం, మజిలీ జోరు కాస్త తగ్గడం వల్ల చిత్రలహరికి నేడు కూడా మంచి షేర్‌ నమోదు అవుతుందని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత సాయి తేజ్‌ సక్సెస్‌ దక్కించుకున్నట్లుగానే పరిగణించవచ్చు.