'చిత్రలహరి' బడ్జెట్‌ ఎంత? బిజినెస్‌ ఎంతో తెలుసా?  

Chitralahari Movie Budget And Pre Business-chitralahari Movie Budget,chitralahari Movie Pre Business,chitralahari Movie Release Date,chitralahari Movie Teaser,sai Dharam Tej

 • మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌, కిషోర్‌ తిరుమలల కాంబినేషన్‌లో రూపొందిన ‘చిత్రలహరి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఎన్నికలు పూర్తి అయిన తెల్లారి అంటే ఈనెల 12వ తారీకున చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ చిత్రంకు ముందు తేజ్‌ చేసిన ఆరు సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అయ్యాయి. అయితే దర్శకుడు కిషోర్‌ తిరుమల కారణంగా ఈ చిత్రంకు మంచి బిజినెస్‌ దక్కింది.

 • 'చిత్రలహరి' బడ్జెట్‌ ఎంత? బిజినెస్‌ ఎంతో తెలుసా?-Chitralahari Movie Budget And Pre Business

 • మైత్రి మూవీస్‌ వారు ఈ చిత్రంను దాదాపుగా 20 కోట్లతో రూపొందించినట్లుగా సమాచారం అందుతోంది. 20 కోట్ల బడ్జెట్‌ నిర్మాతలకు సినిమా విడుదలకు ముందే రికవరీ అయినట్లుగా తెలుస్తోంది.

  Chitralahari Movie Budget And Pre Business-Chitralahari Chitralahari Business Release Date Teaser Sai Dharam Tej

  సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్‌ హక్కుల ద్వారా 13.5 కోట్ల రూపాయలను దక్కించుకుంది. ఇక శాటిలైట్‌ రైట్స్‌ మరియు ఆన్‌లైన్‌ ప్రైమ్‌ వీడియో రైట్స్‌ ద్వారా 7.5 కోట్లను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. విడుదలకు ముందే మైత్రి మూవీస్‌ వారు లాభాలను దక్కించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అన్ని వర్గాల వారు ఈ చిత్రంను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

 • Chitralahari Movie Budget And Pre Business-Chitralahari Chitralahari Business Release Date Teaser Sai Dharam Tej

  సాయి ధరమ్‌ తేజ్‌కు జోడీగా ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శి మరియు నివేదా పేతురాజ్‌లు హీరోయిన్స్‌గా నటించారు. సునీల్‌ ఈ చిత్రంలో పూర్తి స్థాయి కమెడియన్‌గా నటించాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచాయి.

 • ఒక నిరుద్యోగి యువకుడు పడే కష్టాలు, అతడి జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను చిత్రంలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కిషోర్‌ తిరుమల యూత్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా సినిమాలు తీస్తాడు.

 • అలాగే ఈ సినిమా కూడా తీసి ఉంటాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది.