'చిత్రలహరి' కలెక్షన్స్‌ ఏంటీ? బయ్యర్లు బయట పడ్డట్లేనా.. సమగ్ర విశ్లేషణ  

Chitralahari Movie Collections-buyers,chitralahari,కలెక్షన్స్‌,చిత్రలహరి

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన ‘చిత్రలహరి’ చిత్రం రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో కలెక్షన్స్‌ ఒక మోస్తరుగా నమోదు అయ్యాయి. అయితే రెండవ వారంలోనే నాని జెర్సీ చిత్రంతో వచ్చేయడంతో చిత్రలహరి చిత్రంను చూసే వారే కరువు అయ్యారు. సినిమా దాదాపుగా 85 శాతం పడిపోయింది. ఆక్యుపెన్సీ పడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు సినిమా వసూళ్లు ఎంత వరకు వచ్చాయి, బయ్యర్లు సేఫ్‌ అయ్యారా అనే టాక్‌ నడుస్తోంది..

'చిత్రలహరి' కలెక్షన్స్‌ ఏంటీ? బయ్యర్లు బయట పడ్డట్లేనా.. సమగ్ర విశ్లేషణ-Chitralahari Movie Collections

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘చిత్రలహరి’ చిత్రంను అన్ని ఏరియాలకు కలిపి 14 కోట్లకు అమ్మేయడం జరిగింది. అయితే సినిమా మొదటి మూడు రోజుల్లో 9.5 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఆ తర్వాత మరో మూడు కోట్ల వరకు రాబట్టింది. అంటే మొత్తంగా అటు ఇటుగా 13 కోట్ల వరకు రాబట్టిందని ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. 13 కోట్లు వసూళ్లు చేసిన నేపథ్యంలో బయ్యర్లు బయట పడాలి అంటే మరో కోటి వరకు రాబట్టాల్సి ఉంది.

ఇంకా కూడా సినిమా అక్కడ అక్కడ ఆడుతున్న కారణంగా మరో వారం రోజుల్లో కాస్త అటు ఇటుగా అయినా కోటిని రాబట్టే అవకాశం ఉంది. అంటే మొత్తంగా బయ్యర్లు పెట్టిన మొత్తం వరకు వచ్చే అవకాశం ఉంది. లాభం విషయం పక్కన పెడితే బ్రేక్‌ ఈవెన్‌ అయితే దక్కించుకుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈమాత్రం వసూళ్లు రావడం కూడా సాయి ధరమ్‌ తేజ్‌కు సంతోషంను కలిగించే విషయం.