టెస్లా ఇండియా మానవ వనరుల విభాగానికి అధిపతిగా మహిళ .. త్వరలోనే విధుల్లోకి

జనాభాలో ప్రపంచంలోనే రెండవ స్థానం.వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ కావడంతో ప్రస్తుతం అన్ని దేశాల చూపు భారతదేశంపై ఉంది.

 Chithra Thomas Appointed Hr Head At Tesla India, Electric Vehicles, Reliance Ret-TeluguStop.com

తగినంత మార్కెట్, పెట్టుబడులకు అనుకూలించే వాతావరణం ఇక్కడ ఉండటంతో ఇండియాలో ఇన్వెస్ట్ చేసేందుకు కార్పోరేట్ దిగ్గజాలు ఆసక్తి చూపిస్తున్నాయి.తాజాగా అమెరికాకు చెందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ… భారత్‌లో తన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

అన్నీ అనుకున్నట్లే జరిగితే అమెరికా తర్వాత టెస్లా పరిశోధనా కేంద్రం ఉన్న రెండో దేశం ఇండియానే అవుతుంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది.2025 నాటికి ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా రూ.50 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.మొత్తం రూ.50 వేల కోట్ల లక్ష్యంలో రూ.15 వేల కోట్లు… వాహనాల విడి భాగాలైన బ్యాటరీ, కంట్రోలర్, మోటార్ల నుంచి రానుంది.వీటికి తోడు రాబోయే రోజుల్లో భారత్‌లో 30 లక్షల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే కార్యకలాపాలు మొదలుపెట్టేసింది.దీనిలో భాగంగా సంస్థకు అతి ముఖ్యమైన మానవ వనరుల విభాగానికి హెడ్‌గా చిత్రా థామస్‌ను నియమించింది.

ఈ ఏడాది జనవరిలో భారత్‌లో రిజిస్టర్ చేసుకున్న టెస్లా మనదేశంలో త్వరలోనే కార్యకలపాలను ప్రారంభించనుంది.ఇటీవల ఇండియన్ రీజియన్ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్‌గా మనుజ్ ఖురానాను, సూపర్ ఛార్జింగ్ డెస్టినేషన్ అండ్ హోమ్ ఛార్జింగ్ బిజినెస్ హెడ్‌గా ఆర్ధర్ ఎనర్జీకి చెందిన నిశాంత్‌ను నియమించింది.

ఇక చిత్రా థామస్‌కు మానవ వనరుల విభాగంలో 18 ఏళ్ల అనుభవం వుంది.రిలయన్స్ రిటైల్‌ అనుబంధ ఈ- కామర్స్ ఇనిషియేటివ్ అజియో.

కామ్‌లో వైస్ ప్రెసిడెంట్ అండ్ హెచ్ఆర్‌గా ఆరు సంవత్సరాలు పనిచేశారు.చెన్నైలోని లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్ … హెచ్ఆర్ఏలో ఎంబీఏ పూర్తి చేసిన చిత్రా థామస్ తన కెరీర్‌ను హెచ్‌పీఈ ఇండియాతో ప్రారంభించారు.

ఆరేళ్లు అందులో పనిచేశారు.2009లో వాల్‌మార్ట్‌లో చేరిన చిత్రా థామస్ అక్కడ ఐదేళ్లు విధుల్లో కొనసాగారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube