విడాకుల వల్ల బాల్యంలోనే ఇబ్బంది పడ్డ చైతూ.. అదే ఫీలింగ్ తప్పలేదంటూ?

సమంత, నాగచైతన్య అభిమానులలో చాలామంది ఇప్పటికీ సమంత చైతన్యల విడాకుల వార్తలను నమ్మలేకపోతున్నారు.చైతన్య చాలా సెన్సిటివ్ అని వైరల్ అవుతున్న వార్తల వల్ల చైతన్య చాలా బాధ పడుతూ ఉండవచ్చని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 Chitanya Was Troubled Due To Divorce At Childhood , Divorce At Childhood, Laxmi,-TeluguStop.com

తల్లిదండ్రుల విడాకుల వల్ల చిన్నప్పుడే ఇబ్బంది పడిన చైతన్యకు మరోసారి అదే తరహా ఇబ్బందులు ఎదురు కావడం గమనార్హం.పక్కింటి కుర్రాడిలా కనిపించే చైతన్య నాగార్జున కొడుకు అయినప్పటికీ ఆ గర్వాన్ని ప్రదర్శించరు.

ఎంతో ఇన్నోసెంట్ గా కనిపించే వివాదాలకు సైతం దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని నాగచైతన్యకు మొహమాటం కూడా ఎక్కువ.

వివాదాలకు దూరంగా ఉండే అతికొద్ది మంది హీరోలలో చైతన్య ఒకరు.చూడటానికి కూడా చైతన్య చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తారనే సంగతి తెలిసిందే.

చిన్నతనంలో జరిగిన ఘటనల వల్లే చైతూ అలా ఉన్నారని తెలుస్తుండగా చైతన్య లైఫ్ లో మళ్లీ అవే పరిస్థితులు ఎదురవుతుండటం గమనార్హం.

Telugu Laxmi, Nagachaitanya, Nagarjuna, Samantha, Troubled-Movie

నాగచైతన్య కొన్ని విషయాలకు సంబంధించి చాలా రిజర్వ్ గా ఉంటారు.నాగచైతన్య జన్మించిన కొన్ని నెలల తర్వాత లక్ష్మీ, నాగార్జున వేర్వేరు కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు.తల్లీతండ్రి కలిసి లేకపోవడం వల్ల చైతన్య ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.

తల్లీదండ్రుల విడాకుల వల్ల గతంలో ఇబ్బంది పడిన చైతన్య సమంతతో విడాకుల వల్ల మళ్లీ బాధ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సమంతతో విడిపోయినట్లు ప్రకటనలు చేయడంతో చైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించి భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.

చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది.థ్యాంక్యూ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube