ఆ తేదీ కోసం చిరు, ప్రభాస్‌ పోటీ.. చివరకు ఎవరికి దక్కేనో?   Chiru Verses Prabhas For August 15th Date     2018-11-30   10:35:18  IST  Ramesh P

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయాలని భావించారు. కాని నిర్మాణ పనులు ఇంకా ఆలస్యం అవుతున్న కారణంగా సినిమా రెండు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అందుకే ఈ చిత్రంను ఆగస్టు 15న విడుదల చేయాలనే అభిప్రాయంకు చిత్ర యూనిట్‌ సభ్యులు వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సైరా చిత్రం స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కుతుంది కనుక ఆగస్టు 15న విడుదల చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉండటంతో పాటు, మంచి సంతృప్తి కూడా దక్కుతుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుపుతున్నారు. మరో వైపు ఆగస్టు 15వ తారీకునే ‘సాహో’ చిత్రం కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సాహో చిత్రం కూడా ముందుగా సమ్మర్‌లో విడుదల చేయాలని భావించారు. కాని భారీ యాక్షన్‌ సీన్స్‌ను ఈ చిత్రంలో చిత్రీకరిస్తున్న నేపథ్యంలో ఆలస్యం అవుతోంది. అందుకే ఆగస్టులో స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారంటూ వార్తలు వచ్చాయి.

Chiru Verses Prabhas For August 15th Date-Chiru Saaho Movie Saira Narasimha Reddy

ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్నాయి. ఈ రెండు చిత్రాల మార్కెట్‌ వ్యాల్యూ దాదాపు 500 కోట్లుగా చెప్పుకొస్తున్నారు. ఇంతటి భారీ చిత్రాలను ఒకేరోజు విడుదల చేసేంత పిచ్చి పని ఎవరు చేయరు. అందుకే ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒకటి మాత్రమే ఆగస్టు 15న విడుదల అయ్యే అవకాశం ఉంది. రెండు కూడా గ్రాఫిక్స్‌ ప్రధానంగా సాగుతున్న కారణంగా ఏదో ఒక సినిమా ఆలస్యం అవ్వడం లేదా ముందే అవ్వడం జరుగుతుందని, అప్పుడు రెండు సినిమాలకు కనీసం రెండు వారాలు వచ్చేలా విడుదల అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. అందుకే అభిమానులు టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.