ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై దృష్టి పెడుతోన్న చిరు, వెంకీ… వర్కౌట్ అవుతుందా.. ?  

chiru venky focusing on the ott platform will be a workout tollywood, chiranjeevi, victory venkatesh, ott flatform, web series - Telugu Chiranjeevi, Ott Flatform, Tollywood, Victory Venkatesh, Web Series

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఇతర బిజినెస్ రంగాలపై కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు.కాలానికి అనుగుణంగా అనేక మంది సీనియర్ హీరోలు రోజురోజుకు అప్డేట్ అవుతున్నారు.

TeluguStop.com - Chiru Venky Focusing On The Ott Platform Will Be A Workout

ఇక ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఓ ప్లాన్ ను అనుకుంటున్నారు.ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో పూర్తిగా సినిమా హాల్స్ బంద్ కావడంతో అమెజాన్, నెట్ ఫ్లిక్, హాట్ స్టార్ లాంటి ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఎంతగానో ప్రాచుర్యంలోకి వచ్చాయి.

దీంతో ఇప్పుడు చాలామంది దర్శక నిర్మాతలు కూడా సినిమా హాల్స్ దృష్టి పెట్టకుండా కంటెంట్ ఉంటే చాలు ఎక్కడైనా తాము విజయం సాధిస్తాం అన్న నేపథ్యంలో చాలా మంది ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో వారి సినిమాలను రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.దీంతో ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి వెబ్ సిరీస్ లో నటించడానికి ఓకే చెప్పినట్టు టాలీవుడ్ సమాచారం.

TeluguStop.com - ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై దృష్టి పెడుతోన్న చిరు, వెంకీ… వర్కౌట్ అవుతుందా.. -General-Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ ఇంకా మిగతా చిత్ర పరిశ్రమలలో అనేక మంది స్టార్స్ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో నటించేందుకు మొగ్గు చూపుతున్నారు.ఇప్పటికే బాలీవుడ్ లో అభిషేక్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్ లాంటి దిగ్గజ నటీనటులు నటిస్తున్నారు.

దీంతో ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో చిరంజీవి కూడా నటించేందుకు రెడీ అవుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.

ఇక టాలీవుడ్ అగ్ర నటుడు అయిన విక్టరీ వెంకటేష్ కూడా వెబ్ సిరీస్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇందుకోసం ఇప్పటికే కొన్ని కథలను రెడీ చేసే పనిలో సురేష్ బాబు ఉన్నట్లు తెలుస్తోంది.మరికొందరు తెలిపిన సమాచారం మేరకు దర్శకుడు తేజ తో కలిసి వెంకటేష్ ఓ వెబ్ సిరీస్ చేయడానికి సన్నాహాలు మొదలైనట్లు సమాచారం.

ఈయనతో పాటు మరో దర్శకుడు జయంత్ తో కూడా మరో వెబ్ సిరీస్ నిర్మించడానికి ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తోంది.మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు కేవలం సినిమాలు మాత్రమే కాకుండా మరో వైపు కూడా అడుగు వేసి సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు.

#Chiranjeevi #Ott Flatform #Web Series

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiru Venky Focusing On The Ott Platform Will Be A Workout Related Telugu News,Photos/Pics,Images..