ప్రధాని మోడీతో వేదిక పంచుకోనున్న చిరు.. విగ్రహావిష్కరణకు ఆహ్వానం!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరంజీవి ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

 Chiru Sharing Stage With Prime Minister Modi For Idol Unveiling Chiranjeevi, Tollywood, Modi, Azadi Ka Amrit Mahotsav, Bheemavaram, Andrapradesh , Alluri Sitarama Raju-TeluguStop.com

ఇదిలా ఉండగా ఇటీవల చిరంజీవి ఒక అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు.స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి ఒకప్పుడు ప్రజాస్వామ్యం పార్టీని ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

కానీ ఆ పార్టీ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు.హీరోగా ప్రేక్షకులని అలరించటమే కాకుండ కేంద్ర మంత్రిగా కూడా చిరంజీవి ప్రజలకు సేవలు అందించాడు.

 Chiru Sharing Stage With Prime Minister Modi For Idol Unveiling Chiranjeevi, Tollywood, Modi, Azadi Ka Amrit Mahotsav, Bheemavaram, Andrapradesh , Alluri Sitarama Raju-ప్రధాని మోడీతో వేదిక పంచుకోనున్న చిరు.. విగ్రహావిష్కరణకు ఆహ్వానం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే సభలో ఆయనతో పాటు వేదిక పంచుకోనున్నారు.అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం “ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌” అన్న పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో జులై 4న వేడుకలు నిర్వహించబోతున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.ఈ సందర్భంగా నరేంద్ర మోడీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిరంజీవికి ఆహ్వానం పంపారు.

వీరుడిగా పేరుపొందిన అల్లూరి సీతారామరాజు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఒరిస్సా ప్రాంతాలకు బాగా సుపరిచితమైన వ్యక్తి.బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతాల్లో ఎన్నో ఉద్యమాలు నిర్వహించాడు.అందువల్ల అల్లూరి సీతారామరాజుని అందరూ “మన్యం వీరుడు” గా పిలుచుకునేవారు.

జూలై నాలుగవ తేదీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తించనున్నారు.ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిరంజీవి గారికి ఆహ్వానం పంపి ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube