మిలియన్లు కొల్లగొడుతున్న చిరంజీవి - బాలకృష్ణ   Chiru Into 2 Million And Club And Balayya Into 1 Million Club     2017-01-16   00:34:15  IST  Raghu V

ఓవర్సీస్ మార్కెట్ లో మిలియన్ డాలర్ క్లబ్ అనేది పెద్ద విషయమే. మహేష్, పవన్, ఎన్టీఆర్ లాంటి నటులకి ఇది చాలా చిన్న విషయమే కావచ్చు కాని, మిగితావారు ఎవరు మిలియన్ డాలర్ క్లబ్ లోకి వచ్చిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్నిరోజులు సీనియర్ హీరోల్లో నాగార్జున, వెంకటేష్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు) మిలియన్ డాలర్ల సినిమా సాధించారు. ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ కూడా ఈ ఘనత సాధించటంతో చిరంజీవి నుంచి రామ్ చరణ్ దాకా, నలుగురు సీనియర్లు, ఆరుగురు టాప్ హీరోలు, అందరు మిలియన్ క్లబ్ లో చేరిపోయారు. చిరంజీవి ఖైదీనం 150 ప్రీమియర్స్ ద్వారానే మిలియన్ మార్కు దాటి, ఇప్పుడు రెండు మిలియన్ డాలర్ల మార్కుని కూడా దాటేసింది.

ముఖ్య విషయం ఏమిటంటే, ఖైది నం 150 ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ .. ఇద్దరి హయ్యెస్ట్ ఓవర్సీస్ కలెక్షన్ ని దాటేసింది. బాహుబలి, శ్రీమంతుడు, అ ఆ చిత్రాల తరువాత ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన తెలుగు సినిమాగా కొనసాగుతోంది చిరంజీవి 150వ సినిమా. ఇక గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంతో తన ఓవర్సీస్ మార్కెట్ ని పెంచేసుకున్న బాలయ్య బాబు, తొలిసారి మిలియన్ డాలర్ల సినిమాని రుచి చూసారు. ఫుల్ రన్ లో బాలకృష్ణ 100వ చిత్రం 1.5 మిలియన్ నుంచి 2 మిలియన్ల వరకు .. ఎంతైనా చేయవచ్చు అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

మొన్న రామ్ చరణ్, ఇప్పుడు చిరంజీవి – బాలకృష్ణ, ఓవర్సీస్ మార్కెట్ లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి ఇక్కడినుంచి వీరి నుంచి వచ్చే తదుపరి సినిమాలని ఫారెన్ మార్కెట్ జనాలు ఎలా ఆదరిస్తారో చూడాలి.

,