చరణ్‌ మూవీని కత్తిరించే పనిలో చిరంజీవి?     2018-11-16   12:52:47  IST  Ramesh P

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఏ సినిమా చేసినా కూడా ఫైనల్‌ వర్షన్‌ చిరంజీవి మరియు అల్లు అరవింద్‌ చూసి ఓకే చేయాల్సిందే. వారిద్దరు ఓకే చెప్పిన తర్వాతే సినిమా బయటకు వెళ్తుంది అనేది సినీ వర్గాల్లో వినిపించే వాదన. ఆమద్య రంగస్థలం చిత్రంపై కూడా చిరంజీవి వేలు పెట్టే ప్రయత్నం చేశాడు. అయితే సుకుమార్‌పై పూర్తి నమ్మకం ఉంది. ఈసారికి ఆయన చెప్పినట్లుగా వెళ్దాం అంటూ రామ్‌ చరణ్‌ సూచించిన నేపథ్యంలో చిరంజీవి తన ఇన్వాల్వ్‌మెంట్‌ లేకుండానే రంగస్థలంను విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్‌ మూవీ తెరకెక్కింది. ఆ మూవీ ఎడిటింగ్‌ పనిలో చిరంజీవి జోక్యం చేసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

Chiru Interference In Ram Charan Boyapati Movie-Chiru

బోయపాటి శ్రీను భారీ ఎత్తున యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో యాక్షన్‌ను తగ్గించేందుకు చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రామ్‌ చరణ్‌ కెరీర్‌కు, ఇమేజ్‌కు సెట్‌ అయ్యే విధంగా భారీ యాక్షన్‌ సీన్స్‌ లేకుండా చిరంజీవి ఎడిటింగ్‌ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమాను మూడు గంటల నిడివితో పూర్తి చేసిన బోయపాటికి జలక్‌ ఇస్తూ దాదాపు 20 నుండి 25 నిమిషాల సీన్స్‌ను చిరంజీవి లేపేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత రెండు రోజులుగా చిరంజీవి ఇదే పనిలో ఉంటున్నాడని చెబుతున్నారు. ఒకవైపు సైరా చిత్రం షూటింగ్‌లో పాల్గొంటూనే మరో వైపు వినయ విధేయ రామ చిత్రం ఎడిటింగ్‌ వర్క్‌లో కూడా చిరంజీవి బిజీగా ఉన్నాడు.

Chiru Interference In Ram Charan Boyapati Movie-Chiru

‘రంగస్థలం’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత మూవీ అనగానే అంచనాలు భారీగా ఉండటం సహజం. అంతటి అంచనాలను అందుకోవాలంటే ఖచ్చితంగా ఓ రేంజ్‌లో చరణ్‌ కష్టపడాల్సి ఉంటుంది. ఈ చిత్రం కోసం చరణ్‌ బాగా కష్టపడ్డట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్‌ చరణ్‌ మరో విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి. ఈ చిత్రంలో విలన్‌గా వివేక్‌ ఒబేరాయ్‌ నటించగా, హీరోయిన్‌గా కైరా అద్వానీ నటించింది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.