మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్లీ’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఈ చిత్రం క్లైమాక్స్‌లో మూడు నిమిషాలు చిరంజీవి కనిపిస్తాడు.
మొదటి నుండే ఈ చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్లో కనిపించనున్నాడు అంటూ భారీ ప్రచారం జరగడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.ఇక సినిమా విడుదల తర్వాత చిరంజీవి గెస్ట్ రోల్‌కు ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
సినిమా అంతా సో సోగా నడిచినా క్లైమాక్స్‌లో చిరంజీవి ఎంట్రీ ఇచ్చి సినిమా రేంజ్‌ను పెంచేశాడు అంటూ విమర్శకులు సైతం అంటున్నారు.
రామ్ చరణ్ కొన్ని నెలలుగా ఒల్లు హూనం అయ్యేలా కష్టపడి నటిస్తే కేవలం మూడు రోజులు షూటింగ్ చేసి, మూడు నిమిషాలు మాత్రమే కనిపించిన చిరంజీవి ‘బ్రూస్లీ’ సక్సెస్ క్రెడిట్‌ను కొట్టేశాడని మెగా ఫ్యాన్స్ సైతం అంటున్నారు.
బాస్ రీ ఎంట్రీతో మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం కనిపిస్తోంది.మరి కాసేపు చిరు ‘బ్రూస్లీ’లో ఉండి ఉంటే బాగుండేది అని అంటున్నారు.
మొత్తానికి చిరంజీవి చిన్న గెస్ట్ రోల్లో ‘బ్రూస్లీ’ని గట్టెక్కించాడు.‘బ్రూస్లీ’ ఓవరాల్‌గా పర్వాలేదు అన్నట్లుగా ఉంది అంటే అది చిరు గెస్ట్ రోల్ వల్లే అని సినీ ప్రముఖులు సైతం అంటున్నారు.
చిరు 150వ సినిమాకు ఇది ట్రైలర్ అంటూ ముందే మెగా ఫ్యామిలీ ప్రకటించిన విషయం తెల్సిందే.అతి త్వరలోనే 150వ చిత్రం ప్రారంభం కాబోతుంది.