మెగా అభిమానికి చిరు సాయం.. అందుకే మనసు వెన్న అనేది?

Chiru Help For A Mega Fan

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నారు.

 Chiru Help For A Mega Fan-TeluguStop.com

సినిమా ఇండస్ట్రీలో సినీ పెద్దగా వ్యవహరించడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి సామాజిక కార్యక్రమాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటారు.ఈ క్రమంలోనే ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతున్నారు.

ఇప్పటివరకు మెగాస్టార్ ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలను చేయటం గురించి మనం విన్నాం.తాజాగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి సహాయం చేసి మరోసారి తన మనస్సు వెన్న అని నిరూపించుకున్నారు.

 Chiru Help For A Mega Fan-మెగా అభిమానికి చిరు సాయం.. అందుకే మనసు వెన్న అనేది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విశాఖ జిల్లాకు చెందిన మెగా అభిమాని వెంకట్ అనే వ్యక్తి గత కొద్దిరోజుల నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్నారు.ఈ విషయాన్ని అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షులు ఈ విషయాన్ని మెగాస్టార్ దృష్టికి తీసుకువెళ్లారు.

Telugu Blood Bank, Cancer, Chiru Fan, Help, I Bank, Megas Star Chiranjeevi, Oxygen Banks, Tollywood-Movie

విషయం తెలుసుకున్న చిరు తన అభిమానిని వెంటనే హైదరాబాద్ రమ్మని, తన క్యాన్సర్ చికిత్సకు అవసరమయ్యే ఖర్చును మొత్తం తానే భరిస్తానని ఈ సందర్భంగా అభిమానికి హామీ ఇచ్చారు.ఇలా అభిమాని కోసం సహాయం చేయడంతో మరోసారి మెగాస్టార్ తన మనస్సు, తన సేవా గుణం బయటపడింది.ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు మెగా స్టార్ అంటే ఇలాగే ఉండాలి అంటూ అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

#Bank #Oxygen Banks #Cancer #Blood Bank #Chiru Fan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube