ఊటీలో స్టార్ట్ అయిన 'గాడ్ ఫాదర్' షూట్..అధికారికంగా ప్రకటన!

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేసురుకుంది.

 Chiru God Godfather Movie Latest Update-TeluguStop.com

ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సిద్ద అనే పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు.చిరు ఈ సినిమా విడుదలకు సిద్ధం చేస్తూనే వరుస సినిమాలు ప్రకటించాడు.

అందులో ‘గాడ్ ఫాదర్’ సినిమా ఒకటి.మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది.

 Chiru God Godfather Movie Latest Update-ఊటీలో స్టార్ట్ అయిన గాడ్ ఫాదర్’ షూట్..అధికారికంగా ప్రకటన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది అని వార్తలు వచ్చాయి.ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్టు అధికారికంగా తెలిపారు.మరి ఇది ఫస్ట్ షెడ్యూల్ లో లేదంటే సెకండ్ షెడ్యూలో క్లారిటీ అయితే లేదు.

కానీ ఈ సినిమా షూట్ బుధవారం ఊటీ లో స్టార్ట్ అయినట్టు మాత్రం తెలిపారు.

Telugu Acharya, Bhola Shankar, Chiru God Godfather Movie Latest Update, Godfather, Megastar Chiranjeevi, Ooty, Shooting Starts, Vidya Balan-Movie

ఈ సినిమా నిర్మాణ సంస్థ అయినా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమా కీలకంగా ఉండే సిస్టర్ రోల్ ఒకటి ఉంది.అందుకోసం ఇంకా ఎవ్వరిని ప్రకటించలేదు.

Telugu Acharya, Bhola Shankar, Chiru God Godfather Movie Latest Update, Godfather, Megastar Chiranjeevi, Ooty, Shooting Starts, Vidya Balan-Movie

అయితే బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ నటించ బోతుందని వార్తలు వచ్చాయి.మరి చిరు చెల్లెలి పాత్రలో ఎవరిని ఎంపిక చేస్తారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి.ఇక చిరంజీవి ఈ సినిమాతో పాటు భోళా శంకర్ సినిమా కూడా ప్రకటించాడు.

ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

#ChiruGod #OOty #Bhola Shankar #Chiranjeevi #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు