చిరును మెగాస్టార్‌ చేసిన వ్యక్తికి హాస్పిటల్‌కు డబ్బులు లేవట  

Chiru First Movie Director Gudipati Raj Kumar In Hospital-gudipati Raj Kumar,gudipati Raj Kumar In Hospital,mega Star Chiranjeevi

చిరంజీవి హీరోగా పరిచయం అయ్యింది పునాదిరాళ్లు చిత్రంతో అనే విషయం అందరికి తెల్సిందే.ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్‌.ఆయన వయసు ప్రస్తుతం 75 ఏళ్లు.ఉన్న ఒక్కగానొక్క కొడుకు అనారోగ్యంతో కన్నుమూశాడు.

భార్య కూడా ఇటీవలే మృతి చెందడంతో ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.పెన్షన్‌తో కాలం వెల్లదీస్తున్న రాజ్‌ కుమార్‌ గారికి అనారోగ్యం వస్తే హాస్పిటల్‌లో చూపించే నాదుడే కరువయ్యాడు.

Chiru First Movie Director Gudipati Raj Kumar In Hospital-gudipati Raj Kumar,gudipati Raj Kumar In Hospital,mega Star Chiranjeevi Telugu Viral News-Chiru First Movie Director Gudipati Raj Kumar In Hospital-Gudipati Gudipati Hospital Mega Star Chiranjeevi

హాస్పిటల్‌ ఖర్చులు లేకపోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.కిరాయి ఇంట్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న గూడపాటి రాజ్‌ కుమార్‌ను ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా ఆదుకోవాలంటూ నెటిజన్స్‌ కోరుకుంటున్నారు.మొదటి సినిమాతోనే అయిదు నంది అవార్డులు దక్కించుకుని అద్బుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్న గూడపాటి ప్రస్తుతం అత్యంత దారుణ పరిస్థితులో ఉండగా ఆయన్ను ఆదుకునేందుకు మాత్రం ఎవరు రావడం లేదు.