ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉద్యమానికి చిరంజీవి మద్దతు

ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా చేపడుతున్న సంస్కరణలలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారాలని ప్రైవేట్ పరం చేయడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా మొదటిగా దేశవ్యాప్తంగా ఉన్న స్టీల్ ప్లాంట్ లని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమయ్యారు.

 Chiru Declares His Support To Vizag Steel Plant Movement, Tollywood, Megastar Ch-TeluguStop.com

అందులో విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా ఉండటం ఇప్పుడు తెలుగు ప్రజలకి కేంద్ర ప్రభుత్వంపై ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబీకింది.ఎన్నో పోరాటాలు చేసిన 32 మంది బలిదానాలు చేసి, ఎంతో మంది తమ భూములని ఇచ్చి పోరాటంతో విశాఖ ఉక్కుని సాధించుకున్నారు.

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పెద్ద ఉద్యమమే జరిగింది.ఆ బలిదానాల ఫలితంగా విశాఖ ఉక్కుని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

అయితే ఆరంభంలో లాభాల బాటలో వెళ్ళిన విశాఖ ఉక్కుకి సొంతగా గనులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు అన్యాయం చేస్తూ వచ్చాయి.అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా విశాఖ ఉక్కు కోసం సొంత గనులు కేటాయించాలని అడిగిన దాఖలాలు లేవు.

దీంతో బ్రాండ్ ఇమేజ్ ఉన్న విశాఖ ఉక్కు క్రమంగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది.ఇప్పుడు ఆ నష్టలని కేంద్రం చూపిస్తూ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడం పక్కా అని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ సైతం ప్రకటించింది.

ఈ నేపధ్యంలో గత కొంత కాలంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం మరింత తీవ్రతరం అయ్యింది.ఒక్కసారిగా కార్మిక సంఘాలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నాయి.

ఇదే సమయంలో అన్ని పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడంతో పాటు పోరాటంలో భాగం కావాలని అనుకుంటున్నారు.తెలంగాణలో అధికార పార్టీ తరుపున కేటీఆర్ కూడా విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపారు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా తన గొంతు వినిపించారు.ఉద్యమానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు.విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మాభిమానం అని దానిని ప్రైవేటీకరణ చేయడం కరెక్ట్ కాదని, ఆంధ్రుల హక్కుని ఉక్కు సంకల్పంతో కాపాడుకుందాం అంటూ ట్వీట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube