వరుసగా ప్లాప్ లు వచ్చినప్పుడు చిరు అన్నయ్యే నన్ను సపోర్ట్ చేశాడు: శ్రీకాంత్

ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెళ్లి సందD’.ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది.

 Chiru Brother Supported Me When It Get To Consecutive Flops Srikanth Chiranjeevi-TeluguStop.com

కాగా తాజాగా జరిగిన పెళ్లి సందD ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లో మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరి వెంకటేశ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు 25ఏళ్ల తర్వాత రోషన్ తో మళ్లీ పెళ్లి సందడి అనే పేరుతో సినిమా తీస్తానని తను అసలు ఊహించలేదని నటుడు శ్రీకాంత్ అన్నారు ఇదిలా ఉండగా “రోషన్” ని నేను హీరోగా చేస్తానని అన్నారు.నేను ఈ ఇయర్ ఎప్పుడో ప్లాన్ చేద్దామనుకున్నా.

కానీ రాఘవేందర్ రావు గారి హ్యాండ్ ఎంత మంచిదో అందరికీ తెలిసిందే.కాబట్టి ఆయనతో సినిమా తీస్తే రోషన్ కి అన్ని విధాలా అనుభవం వస్తుందని శ్రీకాంత్ వివరించారు.

అందుకే ఎలాంటి ఆలోచన లేకుండా ఓకే చెప్పేశాను అని ఆయన తెలిపారు.

కానీ అంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత మళ్లీ రోషన్ తో అదే పేరుతో పరిచయం చేయడం కరెక్ట్ అవునో కాదో అనే చిన్న భయం కూడా ఉందని ఆయన తెలిపారు.

కానీ ఏం జరిగినా రాఘవేందర్ రావు గారు ఉన్నారన్న నమ్మకంతో ఒప్పుకున్నామని శ్రీకాంత్ అన్నారు.ఆయన కూడా ఇందులో నటిస్తున్నారు కాబట్టి ఇంకా ఏం కాదనే నమ్మకం ఎక్కువగా ఏర్పడిందని ఆయన వివరించారు.

Telugu Chiranjeevi, Flops, Heros, Pellisamdadi, Raghavendra Rao, Roshan, Sri Lle

ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకునే వ్యక్తి అన్నయ్య చిరంజీవి గారు.వాళ్ల హార్డ్ వర్క్, టైమింగ్ ను గమనించు.సక్సెస్, ఫెయిల్యూర్స్ ని ఓకే రకంగా తీసుకో అని రోషన్ కి ఎప్పుడూ చెప్తూ ఉంటానని నటుడు శ్రీకాంత్ అన్నారు.ఒకానొక సమయంలో నాకు వరుస ప్లాప్ లు వచ్చినపుడు ఇక ఊరికి వెల్లిపోదామనుకున్నా అని ఆయన తెలిపారు.

ఆ టైంలోనే రంజీవి గారు ఏంటీ రావట్లేదు అని జరిగింది తెలుసుకొని ఎంతో మోటివేషన్ చేశారని శ్రీకాంత్ చెప్పారు.రోషన్ ఒక్కడే కాదు ప్రస్తుత యువత అందరూ ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని ఆయన అన్నారు.

Telugu Chiranjeevi, Flops, Heros, Pellisamdadi, Raghavendra Rao, Roshan, Sri Lle

ఇక పోతే ఈ సినిమా ఈ నెల 15 వ తేదీన అంటే దసరా పండగ రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.దీంతో ఒక్కపుడు భారీ విజయాన్ని అందుకున్న ఈ పేరుతో ఉన్న సినిమా.ఇప్పుడు ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube