సైరా నరసింహారెడ్డిని వదలనంటున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రెస్టీజియస్ మూవీ సైరా నరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏమిటో చూపించారు చిరంజీవి.

 Chiru 152 Shooting In Sye Raa Sets-TeluguStop.com

ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రొడ్యూస్ చేశాడు.కాగా ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌ శివారులో భారీ సెట్టింగులు వేసిన విషయం అందరికీ తెలిసిందే.

కాగా ఇప్పుడు మెగాస్టార్ తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించనున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల మెగాస్టార్ట్ ప్రారంభించాడు.ఈ సినిమా షూటింగ్ కోసం కూడా సైరా సెట్టింగ్ వేసిన ప్రాంతంలోనే మరో సెట్ వేశారట.అయితే సైరా కోసం వేసిన సెట్స్‌ను అవసరం మేరకు వాడుకోవాలని చూస్తున్నారట చిత్ర యూనిట్.

భారీ సెట్టింగ్స్ కావడంతో షూటింగ్ సులువుగా జరుగుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాను ఓ సామాజిక అంశంతో తెరకెక్కించనున్నాడు దర్శకుడు కొరటాల.

ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి తనను తాను మేకోవర్ చేసుకున్నారు.ఈ సినిమాను కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా ఎంపికయ్యింది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube