చిరంజీవి రాజకీయ పయనం ఎటు ..

చాలా కింద స్థాయి నుంచి ఎదిగి సినిమాల్లో మెగా స్టార్ గా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి దశాబ్దాలపాటు ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు.ఆ క్రేజ్ అలా ఉండగానే రాజకీయ పార్టీ పెట్టి ఆ రంగంలో కూడా తిరుగులేని జెండా ఎగురవేయాలని చూసాడు.

 Chiranjeevis Political Journey To Begin From Where-TeluguStop.com

కానీ అది వర్కవుట్ అవ్వలేదు.ఇక చేసేది లేక అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీని తీసుకువెళ్లి కాంగ్రస్ పార్టీలో విలీనం చేసి ఆ తరువాత రాజ్యసభ సభ్యుడిగా కేంద్రమంత్రి పదవి కూడా చేపట్టాడు.

ఇప్పుడు అవన్నీ అయిపోవడడంతో రాజకీయాలకు సంబంధం లేనట్టుగా సైలెంట్ అయిపోయాడు చిరు.

రాజకీయాలపై ఈ మధ్యకాలంలో చిరంజీవి ఎక్కడా కామెంట్‌ చేసింది లేదు.అయితే, ‘తమ్ముడు పవన్‌ రూటు వేరు.నా రూటు వేరు.

గమ్యం ఒక్కటే.మేమిద్దరం రైలు పట్టాల్లాంటివాళ్ళం.కలిసే అవకాశాల్లేవు.’ అంటూ చిరు తేల్చి చెప్పేసాడు.కానీ ఇప్పుడు చిరంజీవి పాపులారిటీ అంతా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది.అందుకే చిరంజీవి వచ్చే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనకపోతున్నారు అంటూ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి చెప్తున్నాడు.

ఇందులో నిజానిజాలు పక్కనపెడితే చిరు సేవలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయిపొయింది.

కాపు సామాజిక వర్గాన్నీ తిప్పేందుకు కాంగ్రెస్మొ ప్రయత్నిస్తోంది.‘మెగా కుటుంబంలో వేర్వేరు రాజకీయ అభిప్రాయాలకు తావు లేదు’ అనే సంకేతాల్ని మెగా కాంపౌండ్‌ ఈ మధ్యనే పంపిందంటే దానర్ధనం, చిరంజీవి కూడా పరోక్షంగా జనసేనకు మద్దతిస్తున్నట్టే కదా.! మరి, చిరంజీవి జనసేన పార్టీకి ఎంత దగ్గరగా జరుగుతారు.? ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.చిరంజీవి, జనసేనలోకి వెళ్ళాలని మెగా అభిమానులు ఎవరూ కోరుకోవడంలేదు.

ఈ అన్ని విషయాలు చిరు అంచనా వేసుకునే సైలెంట్ గా మారుతున్న రాజకీయ పరిణామాలు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube