మరో మెగా వారసురాలు రాబోతుంది

మెగాస్టార్‌ ఫ్యామిలీ నుండి మొదటి సారి హీరోయిన్‌గా నిహారిక ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.మెగా బ్రదర్‌ కూతురు నిహారిక ఇప్పటికే నాగ శౌర్య హీరోగా ఒక చిత్రంలో నటిస్తోంది.

 Chiranjeevi’s Daughter Srija To Enter Movies?-TeluguStop.com

ఆ చిత్రం షూటింగ్‌ కూడా చక చక జరుగుతోంది.ఇక నిహారిక తర్వాత మెగా ఫ్యామిలీ నుండి మరో వారసురాలు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సినిమాలపై ఆసక్తి చూపుతున్నట్లుగా మెగా వర్గాల నుండి సమాచారం అందుతోంది.శ్రీజ కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుని ఆ తర్వాత అతడి నుండి విడిపోయిన విషయం తెల్సిందే.

ఇటీవలే విదేశాల్లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి వచ్చిన శ్రీజ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

శ్రీజ ప్రస్తుతం బెల్లీ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటుందట.

ఈ సంవత్సరంలోనే శ్రీజను వెండి తెరపై చూసే అవకాశాలున్నాయని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.హీరోయిన్‌గా వస్తుందా లేక క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా ఉంది.

నటనతో పాటు ఈమెకు దర్శకత్వంపై కూడా మక్కువ ఉన్నట్లుగా తెలుస్తోంది.రామ్‌చరణ్‌ తాజాగా ప్రారంభించిన కొణిదెల ప్రొడక్షన్స్‌ను శ్రీజ రన్‌ చేసే అవకాశాలు కూడా లేక పోలేదు అని మెగా సన్నిహితులు చెబుతున్నారు.

మొత్తానికి మెగా ఫ్యామిలీ నుండి రెండవ వారసురాలు సినిమాల్లోకి రాబోతుంది.అతి త్వరలోనే శ్రీజ ఎంట్రీపై మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube