చిరంజీవి బర్త్ డే స్పెషల్.. రీ రిలీజ్ కానున్న ఆ బ్లాక్ బస్టర్ మూవీ?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది.స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాన్ని తిరిగి విడుదల చేయడం ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.

 Chiranjeevis Birthday Special That Blockbuster Movie To Be Re Released , Chiranj-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆగస్టు 9వ తేదీ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన పోకిరి సినిమాని విడుదల చేసి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.ఇక ఈ సినిమాకి ఊహించని విధంగా వసూలు రావడంతో ఇదే ట్రెండ్ మరి కొంతమంది హీరోలు కూడా ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ నెల 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఈయన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించడం కోసం అభిమానులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.అదేవిధంగా అభిమానుల కోసం ఈయన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలలో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమాని ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.

Telugu Chiranjeevi, Gharana Mogudu, Tollywood-Movie

ఘరానా మొగుడు సినిమాతో అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారని సమాచారం.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారకంగా ప్రకటన తెలియజేయాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఈయన గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube