చిరు 152 కథ ఏంటో తెలిసి పోయింది  

Chiranjeevi 152th Movie Story Line Is Leaked - Telugu Chiranjeevi, Chiranjeevi 152th Movie, Koratala Siva, Ram Charan, Telugu Movie Updates, Tollywood Box Office

దర్శకుడు కొరటాల శివ కమర్షియల్‌ సినిమాలు చేస్తాడు.అయితే ఆ కమర్షియల్‌ సినిమాలో చిన్న మెసేజ్‌ను కూడా జోడిస్తాడు.

Chiranjeevi 152th Movie Story Line Is Leaked

శ్రీమంతుడు, భరత్‌ అనే నేను, జనతాగ్యారేజ్‌, మిర్చి ఇలా ప్రతి సినిమాలో కూడా కొరటాల ఇచ్చిన మెసేజ్‌ చాలా పవర్‌ ఫుల్‌గా ఉంది.ఆయన చేసే ప్రతి సినిమా కమర్షియల్‌గా బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది.

అలాగే మెసేజ్‌లు కూడా బాగా పేలాయి.అలాంటి సినిమాలను అందించిన దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి 152వ చిత్రంకు రెడీ అవుతున్నాడు.

చిరు 152 కథ ఏంటో తెలిసి పోయింది-Movie-Telugu Tollywood Photo Image

మెగాస్టార్‌ 152వ చిత్రం షూటింగ్‌ పూజా కార్యక్రమాలు ముగిశాయి.ఇక షూటింగ్‌ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ ఉండబోతుంది.ఇక ఈ సమయంలోనే సినిమా స్క్రిప్ట్‌ గురించి కథ గురించి సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి, అక్కడ ఉండే అధికారులు భక్తులను ఎలా మోసం చేస్తున్నారనే విషయాలను చాలా సున్నితంగా చూపించేందుకు దర్శకుడు కొరటాల శివ ప్రయత్నాలు చేస్తున్నాడు.

 తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రంను కూడా చాలా విభిన్నంగా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ చిత్రంలో హీరోయిన్‌ విషయమై ఇంకా క్లారిటీ రాలేదు.ఈ చిత్రంను రామ్‌ చరణ్‌ మరియు కొరటాల సన్నిహితుడు సుధాకర్‌ కలిసి నిర్మించబోతున్నారు.

కొరటాల గత చిత్రాల మాదిరిగా ఈ చిత్రం భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను అందుకుంటుందనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్‌ ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi 152th Movie Story Line Is Leaked-chiranjeevi 152th Movie,koratala Siva,ram Charan,telugu Movie Updates,tollywood Box Office Related....