ఎత్తుకి పైఎత్తు వేసి, బాలకృష్ణని చిత్తు చేసిన చిరంజీవి     2017-01-01   21:52:53  IST  Raghu V

ఇన్నిరోజులుగా చదరంగం ఆడినంత పని చేశారు మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలకృష్ణ. చిరంజీవి కన్నా ఓరోజు ముందు రావాలని బాలకృష్ణ, బాలయ్య బాబు కన్నా ఓరోజు ముందే తన సినిమా విడుదల చేయాలని చిరంజీవి, ఇద్దరు విడదల ప్రకటించకుండా, అవతలివైపు నుంచి ప్రకటన కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు.

ఇంతలో, చిరంజీవి నుంచి మాస్టర్ మూవ్ వచ్చింది. సెన్సార్ పూర్తి చేసుకున్నా, విడుదల తేది మాత్రం ప్రకటించలేదు మెగాస్టార్. జనవరి 7 దాకా విడుదల తేది ప్రకటించడం కష్టమే అన్న సంకేతాలు బయటకి వెళ్ళాయి. దాంతో, అప్పటిదాకా గౌతమీపుత్ర శాతకర్ణి విడుదల తేది ప్రకటనను కూడా ఆపితే, తమ సినిమాకే నష్టమని బాలకృష్ణ క్యాంప్ లో ఆలోచనలు మొదలయ్యాయి.

ఇంకేముంది, గౌతమీపుత్ర శాతకర్ణి జనవరి 12వ తేదిన విడుదల అవుతున్నట్లు ప్రకటన రానే వచ్చింది. ఇప్పుడు మెగాస్టార్ ఇష్టారాజ్యం. ఖైదీనం 150 సినిమాని ఎలాంటి అనుమానాలు లేకుండా జనవరి 11వ తేదిన విడుదల చేసుకోవచ్చు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.