టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.
ఈ సినిమా ఓపెనింగ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నప్పటికీ ఏదో ఒక కారణంతో ఈ సినిమా లాంచింగ్ వాయిదా పడుతూనే వస్తోంది.ఇది ఇలా ఉంటే ఎట్టకేలకు ఈ సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్ అయింది.

ఈనెల 23 వ తేదీన ఈ సినిమా లాంచింగ్ డేట్ ని ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్.ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఎన్టీఆర్ అభిమానులకు సూపర్ సర్ప్రైజ్ ను ఇవ్వబోతోంది చిత్ర బృందం.అదేమిటంటే ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ఒక ఊహించని ముఖ్య అతిథిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
అంతేకాకుండా ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో పాటకు గాను ఆస్కార్ అవార్డు( Oscar Award ) అందుకోవడంతో ఎన్టీఆర్ లెవల్ మరింత పెరిగింది.దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
కాగా ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ పాన్ ఇండియా లెవెల్లో రూపొందించనున్న విషయం తెలిసిందే.

మరి ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది.ఆర్ఆర్ఆర్ రేంజ్ లో ఉండబోతుందా, ఎన్టీఆర్ క్రేజ్ అలాగే ఉంటుందా లేక పెరుగుతుందా అన్న ఆసక్తి నెలకొంది.అయితే ఇప్పటికే ఈ సినిమాను లాంచ్ చేయాల్సి ఉండగా తారకరత్న ( Tarakaratna )చనిపోవడం ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లాల్సి ఉండడంతో ఈ సినిమాను ఈ నెల 30వ తేదీకి ఫిక్స్ చేశారు.
కాగా ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనున్న విషయం తెలిసిందే.అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా మార్చి 23న జరగనున్న లాంచింగ్ ప్రోగ్రాంకు సైఫ్ అలీ ఖాన్ రాబోతున్నాడు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అలాగే ఈ మూవీ లాంచ్ ప్రోగ్రాం కి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఎన్టీఆర్ కి ఆహ్వానం కూడా అందినట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.చిత్రం బృందం అభిమానులకు ఇవ్వనున్న సర్ప్రైజ్ కూడా ఇదేనంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
