టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అల్లు అరవింద్ తెలుగు ఓటీటీ ఆహా సంస్థను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.ఆహా ద్వారా ఎన్నో వెబ్ సిరీస్ లో సినిమాలు ప్రత్యేకమైన టాక్ షోల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తోంది.
ఇప్పటికే విపరీతమైన సబ్స్క్రైబర్లను సొంతం చేసుకున్న ఆహాను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని నిర్మాత అల్లు అరవింద్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా అహాను ప్రేక్షకులకు ఎంతో దగ్గర చేశారు.
ఇకపోతే తాజాగా ఈయన మెగాస్టార్ చిరంజీవితో సరికొత్త కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటివరకు ఏ భాషలోను రానటువంటి కార్యక్రమాన్ని అల్లు అరవింద్ ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమాన్ని చిరంజీవి ద్వారా చేయించాలని సమాచారం.ఇలా ఆహా కోసం మెగాస్టార్ చిరంజీవి సైతం పెద్ద సాహసం చేస్తున్నారని చెప్పాలి.
ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి ఆహా కోసం రంగంలోకి దిగడం వెనుక ఓ కారణం ఉంది.ఈయనకు కూడా ఆహా లో వాటా ఉందని సమాచారం.అదేవిధంగా ఈ కార్యక్రమానికి చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే ఆయనకు భారీ పారితోషకం చెల్లించడం లేదా ఆ కార్యక్రమా లాభాలలో వాటా ఇవ్వడం గురించి మెగాస్టార్ తో అల్లు అరవింద్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.మరి చిరంజీవి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం తెలియడంతో మెగా అభిమానులు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు.