రవితేజ బర్త్ డే సందర్బంగా చిరు వాల్తేరు వీరన్న అప్డేట్ రాబోతుందా?

మెగా స్టార్‌ చిరంజీవి ప్రస్తుతం మూడు నాలుగు సినిమా లు చేస్తున్నాడు.అందులో ఆచార్య విడుదలకు సిద్దంగా ఉంది.

 Chiranjeevi Walther Veeranna Movie Raviteja Role Update , Chiranjeevi , Walther-TeluguStop.com

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా కు సంబంధించిన విడుదల తేదీ మరింత క్లారిటీ ఇస్తూ త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ఏప్రిల్‌ 1 అంటూ ఇటీవలే ప్రకటించారు.

కాని కరోనా థర్డ్‌ వేవ్‌ వల్ల ఆ తేదీలో వస్తుందో లేదో అనే అనుమానాలు ఉన్నాయి.ఇక చిరంజీవి ఇతర సినిమాల విషయానికి వస్తే మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్ ను గాడ్‌ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నాడు.

సల్మాన్ ఖాన్ ఈ సినిమా లో గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడు.ఇక తమిళ వేదాళం ను భోళా శంకర్ గా రీమేక్ చేస్తున్నారు.

కీర్తి సురేష్ చెల్లి పాత్రలో కీలకంగా కనిపించబోతుంది.ఇక బాబీ దర్శకత్వంలో ఒక సినిమా ను చిరంజీవి చేస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.సినిమాకు సంబంధించిన టైటిల్ పై క్లారిటీ రావాల్సి ఉంది.

వాల్తేరు వీరన్న అంటూ ప్రచారం జరుగుతోంది.ఈ సినిమా లో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

నేడు రవితేజ బర్త్‌ డే సందర్బంగా ఆ విషయమై ఏమైనా అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Chiranjeevi, Raviteja, Raviteja Day, Tollywood-Movie

రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వరుసగా వచ్చాయి.కనుక ఖచ్చితంగా రవితేజ మరియు చిరంజీవి కాంబో సినిమా వాల్తేరు వీరన్న సినిమా గురించి కూడా ఏదో ఒక ప్రకటన వస్తుందని అంతా ఆశిస్తున్నారు.వీరిద్దరి కాంబో సినిమా నిజం కాని.

అది రవితేజ బర్త్‌ డే కు అనౌన్స్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube