Chiranjeevi Walter Veeraiah : విదేశాలకు పయనమైన మెగాస్టార్.. కారణం ఇదేనా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈయన మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Megastar Chiranjeevi Walter Veeraiah Shooting In Foreign,chiranjeevi,walter Veer-TeluguStop.com

ఈ సినిమా మంచి విజయం కావడంతో మెగాస్టార్ చిరంజీవి బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈ సినిమా నుంచి బాస్ సాంగ్ విడుదల చేయగా ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ మిలియన్ వ్యూస్ రాబట్టింది.
ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున సినిమా షూటింగ్ పనులను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా చిత్ర బృందం ఓ షెడ్యూల్ చిత్రీకరణ నిమిత్తం విదేశాలకు వెళుతున్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ తో పాటు ఎన్టీఆర్ చిత్ర బృందం ఫ్రాన్స్ కి వెళ్ళబోతున్నట్టు సమాచారం.డిసెంబర్ మొదటి వారంలో కల్లా ఈ సినిమా షూటింగు మొత్తం పూర్తి చేయాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం.

Telugu Chiranjeevi, God, Mythri Makers, Shruti Haasan, Walter Veeraiah-Movie

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతిహాసన్ నటించిన విషయం మనకు తెలిసిందే.తాజాగా రామోజీ ఫిలిం సిటీలో షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్ర బృందం త్వరలోనే ఫ్రాన్స్ వెళ్లి అక్కడ చివరి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకోనున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఇకపోతే సంక్రాంతి కానుకగా మైత్రి మూవీ మేకర్స్ నుంచి మెగాస్టార్ చిరంజీవి నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న రెండు సినిమాలు ఒకేసారి పోటీకి దిగబోతున్నాయి.

దీంతో ఈ రెండు సినిమాలపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube