Chiranjeevi Waltair Veerayya : 14 గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్.. డీజే వీరయ్య అదర గొడుతున్నాడుగా!

మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈ మధ్య కాలంలో ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం వాల్తేరు వీరయ్య.వరుస రీమేక్ లతో మెగాస్టార్ మెగా అభిమానులకు నిరాశ పుట్టిస్తున్నాడు.

 Chiranjeevi Waltair Veerayya Boss Party Song, Waltair Veerayya, Megastar Chiranj-TeluguStop.com

ఈ తరుణంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పైనే ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆచార్య ప్లాప్ ను మరిపించే విధంగా హిట్ అందుకున్నాడు.

అయినా కూడా అంతగా ఫ్యాన్స్ కు కిక్ అవ్వలేదు.అందుకే ఒరిజినల్ కథతో వస్తున్న ఈ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా చివరి దశకు చేరుకుంది.

ఇక ఈ సినిమా నుండి నిన్న మొదటి సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మెగా ఫ్యాన్స్ ను ఆకట్టు కుంటుంది.మాస్ బీట్స్ తో ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ అయ్యింది.ఇక ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా మెగాస్టార్ తో ఆడిపాడింది. డీజే వీరయ్యగా మారి మెగాస్టార్ అదరగొట్టగా ఈ సాంగ్ కేవలం 14 గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసి ఇంకా స్పీడ్ గా దూసుకు వెళుతుంది.

మరి టాలీవుడ్ ఉన్న సీనియర్ హీరోల్లో ఇదో ఫాస్ట్ రికార్డ్ అని చెప్పవచ్చు.చూడాలి మరి ఈ సినిమా ఎలా ఆకట్టు కుంటుందో.

ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.సంక్రాంతికి సీనియర్ హీరో చిరంజీవి మాత్రమే కాకుండా బాలయ్య కూడా తన సినిమాతో రాబోతున్నాడు.దీంతో ఈ సీనియర్ హీరోల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

https://youtu.be/nsMhMQfD0V0

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube