మా లో విబేధాలు, చిరంజీవి ప్రసంగం ను అడ్డుకున్న రాజశేఖర్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ లో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.అయితే ఈ విబేధాలు మరోసారి బహిరంగంగానే బయటపడ్డాయి.

 Chiranjeevi Vs Rajasekhar In Maa Dairy Inagration-TeluguStop.com

మా నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ మహోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా చిరు అందరిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో మా వైస్ ప్రెసిడెంట్ హీరో రాజశేఖర్ అందరు చూస్తుండగానే మధ్య మధ్యలో అడ్డుపడ్డారు.

అంతటితో ఆగకుండా వేదిక పైనున్న మరొకరి వద్ద నుంచి మైక్ ను లాక్కోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.మా అసోసియేషన్ లో గొడవలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

గత కొంత కాలంగా అంతర్గత విభేదాల తో మా అసోసియేషన్ తరచూ చర్చనీయాంశంగా మారింది.అయితే ఇప్పుడు తాజాగా మెగా స్టార్ ప్రసంగాన్ని కావాలని అడ్డుకోవడం మరింత చర్చకు దారి తీసింది.

Telugu Chiranjeevi, Mavise, Artist-

సభను ఉద్దేశించి చిరంజీవి ప్రసంగించారు.మంచిని మైక్ లో చెబుదాం,చెడును చెవిలో చెబుదాం అంటూ పిలుపునిచ్చిన చిరు ప్రసంగానికి రాజశేఖర్ పదే పదే అడ్డుపడ్డారు.దీనితో ఇబ్బంది పడిన చిరు కూడా దీనిపై సభలోనే మాట్లాడారు.కావాలని కార్యక్రమాన్ని రసాభాస చేయడానికే రాజశేఖర్ ముందుగా ప్లాన్ చేసుకువచ్చారేమో అనిపిస్తుంది అని అన్నారు.మీడియా ముందు గొడవలు పడటం సరికాదని హితవు పలికారు.పెద్దలకు గౌరవం లేనప్పుడు ఇక మేము ఇక్కడ ఎందుకు ఉన్నట్లు అని ప్రశ్నించారు.

రాజశేఖర్ ప్రవర్తన ఖచ్చితంగా తప్పే అని,అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చిరు కోరారు.మరోపక్క రాజశేఖర్ ప్రవర్తన చర్చనీయాంశం కావడం తో మాట్లాడిన ఆయన మా లో చాలా గొడవలు ఉన్నాయని,కేవలం మా వల్లే మా ఇంట్లో కూడా గొడవలు జరిగాయని తెలిపిన ఆయన, అందుకే నాకు కారు యాక్సిడెంట్ అయ్యింది అంటూ తెలిపారు.

అంతేకాకుండా సభలో ఉన్న అందరి కాళ్ల ను తాకుతూ క్షమించాలని కోరి అక్కడ నుంచి వెళ్లిపోయారు.అయితే ఇదే అంశం పై రాజశేఖర్ సతీమణి,మా జనరల్ సెక్రెటరీ స్పందించారు.

రాజశేఖర్ గారి ప్రవర్తన పై క్షమాపణలు తెలిపిన ఆమె చిరంజీవి తమకు చాలా సమయం కేటాయించారన్నారు.తమ అభివృద్ధికి చిరంజీవి ఎన్నో సలహాలిచ్చారని.ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు.తాము దేవుళ్లం కాదని.

తాము కూడా మీలాంటి మనుషులమేనన్నారు.ప్రతి చోట గొడవలు రావడం సహజమన్నారు.

రాజశేఖర్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వమని.ఆయనకు మనసులో ఏదీ దాచుకోవడం రాదన్నారు.

సమస్యలుంటే అసోసియేషన్‌లో పరిష్కరించుకుందామన్నారు.మరోవైపు ఈ పరిణామంపై కో-ఆర్డినేషన్ కమిటీ వేసి సమస్యను పరిష్కరిస్తామని సీనియర్ నటుడు కృష్ణంరాజు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube