వచ్చే మా ఎన్నికల నాటికి చిరంజీవి సత్తా తెలుస్తుంది.. ఓటమితో సత్తా తగ్గలేదంటూ?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆ ఎన్నికల ఫలితాల గురించి జోరుగా చర్చ జరుగుతోంది.మంచు విష్ణు గెలిచిన తర్వాత ప్రకాష్ రాజ్  ప్యానల్ సభ్యుల రాజీనామాల గురించి తీసుకున్న నిర్ణయం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 Chiranjeevi Vs Mohan Babu After Maa Elections How Mega Family Effect In Tollywoo-TeluguStop.com

మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వానికి ప్రకాష్ రాజ్, నాగబాబు రాజీనామా చేశారు.ఎన్నికలకు ముందు సైతం చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు మధ్య పోటీ అనేలా ఈ ఎన్నికలు జరుగుతున్నాయనే కామెంట్లు వినిపించాయి.

ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధానంగా మెగా ఫ్యామిలీ హవా తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇండస్ట్రీలో ఇకపై మోహన్ బాబు హవా కొనసాగనుందని ఇండస్ట్రీ పెద్ద కూడా మోహన్ బాబు అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

అయితే సినీ విశ్లేషకులు మాత్రం ఒక్క ఎన్నిక ఫలితాల వల్ల టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ సత్తా తగ్గిపోదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.గతంలో చిరంజీవి మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఓడిపోలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి చెప్పిన వ్యక్తి ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ప్రతిసారి అదే విధంగా జరుగుతుందన్న గ్యారంటీ అయితే లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Telugu Chiranjeevi, Maa, Manchu Vishnu, Effect, Mohan Babu, Nagababu, Prakash Ra

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో చిరంజీవి ఆధిపత్యానికి తెరపడిందని వైరల్ అవుతున్న ప్రచారంలో నిజం లేదని మరో రెండేళ్లలో మళ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆ సమయంలో మెగాస్టార్ సత్తా ఏంటో తెలుస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Telugu Chiranjeevi, Maa, Manchu Vishnu, Effect, Mohan Babu, Nagababu, Prakash Ra

ఒక ఓటమి మెగా ఫ్యామిలీ సత్తాను తెలియజేయడం జరగదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు విష్ణు త్వరలోనే చిరంజీవిని కలిసి ప్యానెల్ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఆయనను ఆహ్వానించనున్నారు.చిరంజీవి విష్ణుకు అనుకూలంగా మాట్లాడితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల రచ్చ కూడా ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube