సన్నాఫ్ ఇండియా టీజర్‌లో ఆచార్య సర్‌ప్రైజ్.. వెరీ ఇంట్రెస్టింగ్!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా రోజుల తరువాత లీడ్ రోల్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకుసన్నాఫ్ ఇండియాఅనే ఆసక్తికర టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

 Chiranjeevi Voiceover In Son Of India Teaser, Chiranjeevi, Mohan Babu, Son Of In-TeluguStop.com

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.ఇక తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ సినిమాలో మోహన్ బాబు రఫ్ లుక్‌తో ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ‘సన్నాఫ్ ఇండియా’ టీజర్‌లో మోహన్ బాబు పాత్రకు సంబంధించిన ఎలివేషన్‌ను మనకు చూపించే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్.

ఇక ఎవరూ ఊహించని విధంగా ఈ పాత్రకు సంబంధించిన లక్షణాలను మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో చిత్ర యూనిట్ రిలీజ్ చేయడం అందరినీ అవాక్కయ్యేలా చేసిందని చెప్పాలి.ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

కాగా ఈ సినిమాలో ఆయన చెప్పే డైలాగులు సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాను పూర్తి థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో దర్శకుడు డైమండ్ బాబు తెరకెక్కిస్తున్నట్లు ఈ టీజర్ చూస్తే మనకు ఇట్టే అర్ధం అవుతోంది.

కాగా సన్నాఫ్ ఇండియా చిత్రంలో మోహన్ బాబుతో పాటు శ్రీకాంత్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.

విష్ణు మంచు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

ఇక సన్నాఫ్ ఇండియా టీజర్‌ను మీరూ ఓసారి చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube