టాలీవుడ్లో మెగా వర్సెస్ మంచు ఫ్యామిలీ స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్‌బాబు మధ్య ఇంటర్నల్‌గా వైరుధ్యం ఉన్నా ఎంతో సాన్నిహిత్య సంబంధం కూడా ఉంది.కొన్ని సార్లు వీరు ఓపెన్‌గానే ఒకరిపై మరొకరు సీరియస్‌గా కౌంటర్లు వేసుకున్నా తమది టామ్ అండ్ జెర్రీ బంధమని…తాము చిన్న చిన్న కోట్లాటలు ఆడుకున్నా వెంటనే కలిసిపోతామని.
తమది చిరుకోపమని చిరునే స్వయంగా చెప్పారు.
ఇదిలా ఉంటే తాజాగా మంచు హీరో నటిస్తోన్న ఓ సినిమాలో మెగాస్టార్ ఓ రోల్ చేస్తున్నాడు.
ఈ వార్త వినడానికి కాస్త షాకింగ్‌గా ఉన్నా నిజమే.మంచు మనోజ్ తాజా చిత్రం గుంటూరోడు వచ్చే నెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఉంది.
అయితే అది కథలో కదిలే పాత్ర కాకపోయినా వినిపించే పాత్ర.
చిరు ఈ సినిమాకు ఓ కీలక టైంలో వాయిస్ ఓవర్ అందిస్తున్నారట.ఇక గత వారం రిలీజ్ అయిన ఘాజీ సినిమాలో కూడా చిరు వాయస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మరి చిరు సెంటిమెంట్ గుంటూరోడుకు సినిమాకు కూడా పనిచేసి ఈ సినిమా కూడా ఘాజీలా హిట్ అవుతుందేమో చూద్దాం.నూతన దర్శకుడు సత్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది.