కేరళ బ్యాక్‌డ్రాప్‌తో మెగాస్టార్ మూవీ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే.స్టార్ చిత్రాల దర్శకుడు కొరటల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Chiranjeevi Vedalam Remake To Have Kerala Backdrop-TeluguStop.com

ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే చిరంజీవి తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా ఓకే చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు చిరంజీవి రెడీ అవుతున్నాడు.తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా రానుండటంతో ఈ సినిమాలో చిరు లుక్స్, పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

 Chiranjeevi Vedalam Remake To Have Kerala Backdrop-కేరళ బ్యాక్‌డ్రాప్‌తో మెగాస్టార్ మూవీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమాను కేరళ నేపథ్యంలో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా కథకు కేరళ నేపథ్యం చాలా కీలకం కానుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఏదేమైనా ఈ సినిమాలో కేరళ బ్యాక్‌డ్రాప్‌ను మెహర్ రమేష్ ఓ రేంజ్‌లో చూపించనున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ సినిమాలో మిగతా నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.మరి వేదాళం సినిమాలో చిరు ఎలాంటి లుక్‌లో కనిపిస్తాడా అనేది మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది.

మెహర్ రమేష్ తెరకెక్కించబోయే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో కూడా తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

#Chiranjeevi #Meher Ramesh #Vedalam Remake #Kerala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు