లాక్‌డౌన్‌లో చిరు సర్‌ప్రైజ్.. ఏమిటో?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరికొత్త గెటప్‌లో మనకు కనిపిస్తాడట.

 Chiranjeevi, Tweet, Acharya, Telugu Movie Nes, Tollywood News-TeluguStop.com

ఇక ఈ సినిమా పూర్తి సోషల్ మెసేజ్‌తో తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

కాగా ఈ సినిమాలో చిరుతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను చిరు ఓ సినిమా ఈవెంట్‌లో లీక్ చేయడంతో చిత్ర యూనిట్ అవాక్కయ్యింది.

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు చిరు రెడీ అవుతున్నాడు.ఈ మేరకు ట్విట్టర్‌లో తాజాగా ఓ ట్వీట్ కూడా చేశాడు.

రేపు ఉదయం 9 గంటలకు ఓ సర్‌ప్రైజ్ ఉన్నట్లు చిరు పేర్కొన్నాడు.

అయితే ఈ సర్‌ప్రైజ్ ఏమై ఉంటుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ను చిరు చెప్తాడా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube