అటకెక్కేసిన మెగా ప్రాజెక్ట్..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తవ్వగా, కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

 Chiranjeevi Trivikram Movie Shelved, Chiranjeevi, Trivikram, Tollywood News, Ntr-TeluguStop.com

కాగా ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఆచార్య చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే, మెగాస్టార్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తూ దూకుడు చూపిస్తున్నాడు.

ఈ క్రమంలోనే మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు రెడీ కాగా, తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘వేదాళం’ను కూడా రీమేక్ చేసేందుకు చిరు ప్లాన్ చేస్తు్న్నాడు.అయితే ఎప్పటినుండో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాలని చిరు భావిస్తున్నాడు.

కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో, ఇటీవల త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు చిరు రెడీ అవుతున్నాడని వార్తలు వచ్చాయి.దీంతో మెగా ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ సినిమాపై అప్పుడే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు మొదలయ్యాయి.

కానీ త్రివిక్రమ్ ఇప్పుడప్పుడే ఈ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు సిద్ధంగా లేడని తెలుస్తోంది.ఈ ఏడాదిలో అల వైకుంఠపురములో చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న త్రివిక్రమ్, తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత యంగ్ హీరో రామ్ పోతినేనితో ఓ సినిమా చేయనున్నాడు.అటుపై మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇలా వరుసగా ఇతర హీరోలతో సినిమాలు చేయనున్న త్రివిక్రమ్ మెగాస్టార్‌తో ప్రస్తుతానికి ఎలాంటి సినిమాను చేయకపోవచ్చని చిత్ర వర్గాలు అంటున్నాయి.అంటే ఈ మెగా ప్రాజెక్ట్ పట్టాలెక్కకముందే అటకెక్కిందని సినీ వర్గాలు అంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube