విజయ్ బాపినీడు మృతదేహానికి నివాళి అర్పించిన మెగాస్టార్!  

ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు ఈ రోజు హైదరాబాద్ లో ఆయన స్వస్థలంలో మృతి చెందిన సంగతి అందరికి తెలిసిందే. ఆయన మృతికి చిత్ర పరిశ్రమని తీవ్ర సంతాపం తెలియజేసారు. అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన మృతికి సంతాపం తెలియజేసారు. ఇక విజయ బాపినీడు మృతదేహాన్ని ఆయన స్వగ్రామంలో సందర్శకుల దర్శనార్ధం ఏర్పాటు చేసారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి కొద్ది సేపటి క్రితం ఆయన ఇంటికి చేరుకొని ఆయనకి ఘనంగా నివాళి అర్పించారు. విజయ బాపినీడు తనకి ఓ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు అని, అంతకు మించి అతనితో తనకి మంచి సన్నిహిత సంబంధం వుందని తెలియజేసారు. విజయ బాపినీడుతో చేసిన చిత్రాలు తన కెరియర్ లో మైలురాళ్ళుగా నిలిచిపోయాయని, అతని మరణం చిత్ర పరిశ్రమని తీరని లోటని అభివర్ణించారు. ఆయన కుటుంబానికి ఎల్లప్పుడు తన సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా చిరంజీవి తెలియజేసారు.