గుండుతో అందరినీ ఫూల్స్ చేసిన చిరు!  

Chiranjeevi Tonsured Look Is Fake, Chiranjeevi, Tonsured Look, Urban Monk, Acharya, Ram Charan - Telugu @chiranjeevikonidela, Acharya, Chiranjeevi, Ram Charan, Tonsured Look, Urban Monk

మెగాస్టార్ చిరంజీవి నటించే ప్రతి సినిమాకు వేరియేషన్ చూపించేందుకు ప్రయత్నిస్తుంటాడు.ఇందులో భాగంగా ఆయన తన గెటప్, లుక్స్‌లోనూ కీలక మార్పులు చేస్తుంటారు.

TeluguStop.com - Chiranjeevi Tonsured Look Is Fake

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కాగా చిరు నటించిన లాస్ట్ మూవీ సైరా కోసం ఆయన గుబురు మీసాలతో పాటు గడ్డం కూడా పెంచిన సంగతి తెలిసిందే.తాజాగా చిరు నటిస్తున్న ఆచార్య చిత్రంలో ఆయన అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపించనున్నాడు.

TeluguStop.com - గుండుతో అందరినీ ఫూల్స్ చేసిన చిరు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా, లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే అందరికీ షాకిస్తూ చిరు గుండు లుక్‌తో కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.

చిరు ఉన్నపలంగా ఇలా గుండు లుక్‌లో ఎందుకు కనిపించాడని అందరూ అనుకున్నారు.అయితే వేదాలం సినిమా రీమేక్ కోసమే చిరు ఇలా గుండు లుక్‌లో దర్శనమిచ్చాడనే వార్తలు వినిపించాయి.

కానీ చిరు నిజంగా గుండు చేసుకోలేదని తెలియడంతో అందరూ నోరెళ్లబెట్టారు.కేవలం గుండు లుక్‌లో తాను ఎలా ఉంటానో తెలుసుకునేందుకే చిరు ఇలా ట్రై చేసినట్లు తెలుస్తోంది.

నిజమైన గుండును పోలి ఉండేలా తనకు మేకప్ చేసిన టెక్నీషియన్స్‌ను ఆయన ఈ సందర్భంగా మెచ్చుకున్నారు.

తన ఇన్నేళ్ల కెరీర్‌లో గుండు లుక్‌లో ఎప్పుడూ కనిపించని చిరు, ఆ లుక్‌లో ఎలా ఉన్నాడో తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు.

సినిమాలో సహజంగా చూపించేందుకు మేకప్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చేస్తున్న కృషిని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.ఇక గుండు లుక్ రియల్ కాదని తేలడంతో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా ఆచార్య చిత్ర షూటింగ్‌ను అతి త్వరలో తిరిగి ప్రారంభించాలని, వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడు.కొరటాల తెరకెక్కిస్తున్న ఆచార్య చిత్రంలో చిరు సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.

#Tonsured Look #Urban Monk #Acharya #Ram Charan #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi Tonsured Look Is Fake Related Telugu News,Photos/Pics,Images..