చిరంజీవి ఇంటర్నేషనల్‌ స్కూల్‌... మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

మెగా ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌ బిజినెస్‌లోకి ఎంటర్‌ కాబోతుంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా మొత్తం కూడా ప్రస్తుతం విద్య అనేది అద్బుతమైన వ్యాపారంగా చెప్పుకోవచ్చు.

 Chiranjeevi To Start International School-TeluguStop.com

మంచి విద్యను అందించే ఉద్దేశ్యంతో పిల్లల తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసేందుకు కూడా వెనుకడాటం లేదు.అందుకే కొత్త స్కూల్స్‌ కుప్పలు తెప్పలుగా పుట్టుకు వస్తున్నాయి.

అదే దారిలో మెగా వారి నుండి ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ రాబోతుంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కూల్స్‌ను విచ్చలవిడిగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
చిరంజీవి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అనే పేరుతో మొదటగా శ్రీకాకుళం జిల్లాలో మొదటి బ్రాంచ్‌ ఏర్పాటు చేస్తున్నారు.ఈ స్కూల్‌ ఈ ఏడాది నుండే ప్రారంభం కాబోతుంది.మొదటి సంవత్సరం నర్సరీ నుండి 5వ క్లాస్‌ వరకు ఉండబోతుంది.ఆ తర్వాత మెల్ల మెల్లగా క్లాస్‌లు పెంచడంతో పాటు, బ్రాంచ్‌లు పెంచబోతున్నారు.

నర్సరీ నుండి ఇంటర్‌ వరకు మెరుగైన విద్యను అందించేందుకు మెగా ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తున్నారట.స్కూల్‌ ఏర్పాట్లు ప్రస్తుతం చకచక జరుగుతున్నాయి.

చిరంజీవి ఇంటర్నేషనల్‌ స్కూల్

ఈ స్కూల్స్‌ నిర్వహన చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ మరియు మెగా బ్రదర్‌ నాగబాబు చూసుకోబోతున్నారట.వీరిద్దరు కూడా భాగస్వామ్యులుగా ఈ స్కూల్స్‌ను నిర్వహించబోతున్నారు.ఈ స్కూల్స్‌లో మెగా ఫ్యాన్స్‌కు రాయితీ ఇచ్చే ఉద్దేశ్యం కూడా ఉందని తెలుస్తోంది.మొత్తానికి మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న కార్పోరేట్‌ స్కూల్‌ అయినా మెరుగైన విద్యను అదిస్తుందా అనేది చూడాలి.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్కూల్స్‌ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాయనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి.మరి చిరంజీవి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube