చిరంజీవి ఇంటర్నేషనల్‌ స్కూల్‌... మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌  

Chiranjeevi To Start International School-education Business,srikakulam,ఇంటర్నేషనల్‌ స్కూల్‌,మెగా ఫ్యాన్స్‌

మెగా ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌ బిజినెస్‌లోకి ఎంటర్‌ కాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా మొత్తం కూడా ప్రస్తుతం విద్య అనేది అద్బుతమైన వ్యాపారంగా చెప్పుకోవచ్చు. మంచి విద్యను అందించే ఉద్దేశ్యంతో పిల్లల తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసేందుకు కూడా వెనుకడాటం లేదు...

చిరంజీవి ఇంటర్నేషనల్‌ స్కూల్‌... మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌-Chiranjeevi To Start International School

అందుకే కొత్త స్కూల్స్‌ కుప్పలు తెప్పలుగా పుట్టుకు వస్తున్నాయి. అదే దారిలో మెగా వారి నుండి ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ రాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కూల్స్‌ను విచ్చలవిడిగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.


నర్సరీ నుండి ఇంటర్‌ వరకు మెరుగైన విద్యను అందించేందుకు మెగా ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తున్నారట. స్కూల్‌ ఏర్పాట్లు ప్రస్తుతం చకచక జరుగుతున్నాయి.

ఈ స్కూల్స్‌ నిర్వహన చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ మరియు మెగా బ్రదర్‌ నాగబాబు చూసుకోబోతున్నారట. వీరిద్దరు కూడా భాగస్వామ్యులుగా ఈ స్కూల్స్‌ను నిర్వహించబోతున్నారు.

ఈ స్కూల్స్‌లో మెగా ఫ్యాన్స్‌కు రాయితీ ఇచ్చే ఉద్దేశ్యం కూడా ఉందని తెలుస్తోంది. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న కార్పోరేట్‌ స్కూల్‌ అయినా మెరుగైన విద్యను అదిస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్కూల్స్‌ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాయనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి...

మరి చిరంజీవి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఎలా ఉంటుందో చూడాలి.