మెగాస్టార్‌కు చుక్కలు చూపిస్తున్న చందమామ.. దెబ్బకు స్వీటీని పట్టేశాడు?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ‘ఆచార్య’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Chiranjeevi To Romance Anushka Shetty Not Kajal-TeluguStop.com

ఇటీవల ఓ సినిమా వేడుకలో పొరపాటున ఈ సినిమా టైటిల్‌ను చిరు అనౌన్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.అయితే ఆచార్య సినిమాలో హీరోయిన్‌గా త్రిష నటిస్తుందని తొలుత వార్తలు వచ్చాయి.

కానీ ఇటీవల కొన్ని కారణాలతో ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు త్రిష ప్రకటించింది.దీంతో మరో స్టార్ బ్యూటీ వేటలో పడ్డారు ఈ చిత్ర యూనిట్.

ఇందులో భాగంగా అందాల భామ కాజల్ అగర్వాల్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని ప్లాన్ చేశారు.కానీ ఆమె అడిగిన రెమ్యునరేషన్‌కు చిత్ర యూనిట్‌కు చుక్కలు కనిపించాయి.

దీంతో వారు మరో హీరోయిన్‌ను వెతికే పనిలో పడ్డారు.ఇందులో భాగంగా టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్కను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకుంటే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

దీనికి సంబంధించిన సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమాలో నటించేందుకు అనుష్క ఓకే అంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికి ఆచార్య సినిమాకు హీరోయిన్ సమస్య ఏమిటో అని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.మరి ఈ సినిమా హీరోయిన్ ఎవరనే విషయంపై చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేవరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ జనం.ఇక ఈ సినిమాను నిరంజన్ రెడ్డితో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube