పవన్‌ నిర్ణయం తప్పు పట్టిన చిరు

పవన్‌ కళ్యాణ్‌ వచ్చే నెల 8న ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జాతీయ మీడియాతో మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌ తాను ఇక మూడు నాలుగు సినిమాలకు మించి నటించనేమో అంటూ తేల్చి తెప్పాడు.

 Chiranjeevi To Pawan Don’t Quit Acting-TeluguStop.com

తాజాగా తెలుగు మీడియా సంస్థలతో కూడా మాట్లాడుతూ అదే విషయాన్ని చెప్పాడు.దాంతో పవన్‌ కళ్యాణ్‌ నటించేది మరో మూడు నాలుగు సినిమాలు మాత్రమే అని అంతా అనుకుంటున్నారు.

మెగా ఫ్యాన్స్‌ ఇప్పటి నుండే ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మెగాస్టార్‌ సైతం పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయంను తప్పు పట్టారు

తాజాగా జరిగిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ పవన్‌ నిర్ణయాన్ని పున: సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఫ్యాన్స్‌ కోసం పవన్‌ నటించాలని తాను భావిస్తున్నాను అన్నాడు.పవన్‌ ఏ బాధ్యత లేకుండా ఉన్న రోజుల్లో తాను నటుడిగా మారాలని సలహా ఇచ్చాను.

ఆ సలహా తీసుకుని ఇప్పుడు ఇంత పెద్ద స్టార్‌ అయ్యాడు.మళ్లీ ఇప్పుడు నేను సినిమాలను మానేయవద్దు అంటూ సలహా ఇస్తున్నాను అని, ఫ్యాన్స్‌ కోసం సినిమాలు చేయాలని చిరంజీవి అన్నాడు.

చిరంజీవి అలా మాట్లాడిన సమయంలో పవన్‌ కళ్యాణ్‌ నవ్వుతూ ఉండి పోయారు.ఆ తర్వాత పవన్‌ మాట్లాడే సమయంలో చిరంజీవి మాటలపై స్పందిస్తాడని ఫ్యాన్స్‌ ఆశించారు.

కాని పవన్‌ మాత్రం తన కెరీర్‌ గురించి ఈ వేడుకలో మాట్లాడలేదు.మరి చిరంజీవి సలహా మేరకు పవన్‌ సినిమాల్లో కొనసాగుతాడా లేక ముందు నుండి చెబుతున్నట్లుగా పవన్‌ సినిమాలకు గుడ్‌ బై చెబుతాడా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube