మాకోసం కాదు ఆ 14 వేల మంది కోసం ఒప్పుకోండి అంటూ చిరు విజ్ఞప్తి

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి మరియు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు పలువురు నేడు ఉదయం మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో భేటీ అయిన విషయం తెల్సిందే.ఈ భేటీలో పలు విషయాలను చర్చించారు.

 Megastar Chiranjeevi Request To Telangana Cm Kcr About Movie Shootings, Chiranje-TeluguStop.com

తెలుగు సినిమా ఇండస్ట్రీ లాక్‌డౌన్‌ వల్ల పడ్డ ఇబ్బందులు, నష్టపోయిన విధానం ఇంకా పలు విషయాలపై చర్చించారు.ఈ సందర్బంగా చిరంజీవి, రాజమౌళి, అల్లు అరవింద్‌, నాగార్జున ఇతరులు తలసానికి షూటింగ్స్‌ ప్రారంభించేందుకు అనుమతించాలంటూ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.షూటింగ్స్‌ మద్యలో అగిపోయాయి అని, నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు అని కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన 14 వేల మంది సినీ కార్మికులను దృష్టిలో పెట్టుకుని షూటింగ్స్‌కు అనుమతించాలంటూ విజ్ఞప్తి చేశారు.

సాదారణంగా అయితే షూటింగ్స్‌కు ఎప్పుడు కూడా ప్రభుత్వం అనుమతి అక్కర్లేదు.కాని ప్రస్తుత విపత్తు నేపథ్యంలో ప్రభుత్వంతో కలుపుకు పోవాలనే ఉద్దేశ్యంతో వారి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాము.

Telugu Allu Aravind, Chiranjeevi, Nagarjuna, Rajamouli, Telangana-Movie

సినీ కార్మికుల జీవితాల కోసం అయినా వారి ఆకలి బాధలు తీర్చేందుకు అయినా షూటింగ్స్‌కు అనుమతించాలంటూ సీఎం కేసీఆర్‌కు మెగాస్టార్‌ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. జూన్‌ మొదటి వారంలో షూటింగ్స్‌కు అనుమతి ఇస్తామంటూ గతంలో తలసాని పేర్కొన్నారు.అయితే ఈసారి మాత్రం కేసీఆర్‌తో చర్చించి త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామంటూ హామీ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube