తెలుగు సినిమా చరిత్ర లో మకుటం లేని మహారాజు గా పేరు గాంచిన మెగా స్టార్ చిరంజీవి రాజకీయాలలోకి వెళ్ళినా ఆయన అగ్రస్థానం అలాగే పదిలంగా ఉండడం విశేషం.తన ఇమేజ్ కి తగ్గ కథ దొరక్కపోవడం తో కత్తి రీమేక్ ని చెయ్యడం కోసం చిరంజీవి సిద్దం అయిన సంగతి తెలిసిందే.
ఈ పాత్ర కోసం ఆయన రీసెంట్ గా లుక్ మార్చుకుని మరీ సన్నగా అయ్యారు.ఒకప్పుడు రికార్డుల మోత మోగించిన చిరంజీవి కి ఇప్పుడు టార్గెట్ బాహుబలి అయ్యింది.
కానీ అదంతా ఆషా మాషీ విషయం ఏమీ కాదు ఇండస్ట్రీ లో తిరుగులేని స్టార్ గా పేరుగాంచిన చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే సరికి టార్గెట్ దాదాపు యాభై కోట్లు అని చెప్పాలి.మొన్ననే సోగ్గాడే చిన్ని నాయన తో యాభై కోట్లు కొట్టేసారు నాగార్జున.
సో బాహుబలి రేంజ్ చెయ్యలేకపోయినా కనీసం నాగార్జున ని దాటాలి అనేది చిరు టార్గెట్.మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంది.ఈ నెల 25 న చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లి జరుగుతుండటంతో ఆ తరువాత ఈ సినిమా ప్రారంభం కావచ్చు అని తెలిసింది.