ఆ రాత్రి నిద్రపోకుండా ఏడ్చా.. చిరంజీవి కీలక వ్యాఖ్యలు..?

బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ప్రతిభ, స్వయంకృషితో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఘనవిజయాలను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.చిరంజీవి సోదరులు పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకోగా నాగబాబు సైతం సినిమాల ద్వారా నటుడిగా సత్తా చాటారు.

 Megastar Chiranjeevi Talks About His Father Angry , Actor Chiranjeevi, Childhood-TeluguStop.com

అయితే చిరంజీవి ఒక సందర్భంలో మాట్లాడుతూ ముగ్గురు అన్నాదమ్ములలో తండ్రి కోపానికి తానే ఎక్కువగా బలయ్యేవాడినని చెప్పుకొచ్చారు.

నాన్నకు ఎప్పుడైనా కోపం వస్తే నాగబాబు పారిపోయేవాడని కళ్యాణ్ చిన్నవాడు కాబట్టి తప్పించుకునేవాడని నాగబాబు చెప్పుకొచ్చారు.

గోగు పుల్లలను తీసుకొని తాను, నాగబాబు కత్తియుద్ధం చేసేవాళ్లమని ఆ పుల్లలు కంట్లో పొడుచుకుంటాయని భావించే ఆ పుల్లలతోనే నాన్న నన్ను వాయించేవారని చిరంజీవి తెలిపారు.తాను ఇంటర్ చదువుతున్న సమయంలో ఫ్యాన్ కు రిపేర్ వస్తే నాన్న చేయించుకురావాలని చెప్పడంతో ఫ్యాన్ ను మెకానిక్ కు ఇచ్చానని ఫ్యాన్ ను సాయంత్రం తీసుకుందామని షాప్ కు వెళితే షాప్ మూసేసి ఉందని చిరంజీవి చెప్పారు.

Telugu Chiranjeevi, Childhood, Fan Repair, Angry, Nagababu, Pawan Kalyan, Teared

ఫ్యాన్ ఉంటే మాత్రమే నాన్నకు నిద్ర పడుతుందని తాను ఫ్యాన్ ను రిపేర్ చేయించలేదనే విషయం తెలిసి నాన్న కోపంతో బాగా కొట్టారని చిరంజీవి అన్నారు.ఆ తరువాత ఫ్యాన్ తెచ్చేవరకు ఇంటికి రావద్దంటూ తనను ఇంటి నుంచి బయటకు పంపారని చిరంజీవి చెప్పుకొచ్చారు.ఆ తరువాత తాను ఫ్రెండ్ ఇంట్లో ఉన్న టేబుల్ ఫ్యాన్ ను ఇంటికి తీసుకెళితే నాన్న తనకు చదువు దండగ అని రికార్డులను చించేశారని చిరంజీవి చెప్పుకొచ్చారు.

బాటనీ రికార్డులను నాన్న చించివేయడంతో ఆ రాత్రి అంతా తాను ఏడుస్తూనే ఉన్నానని చిరంజీవి తెలిపారు.

తరువాత రోజు నాన్న నన్ను సముదాయించి టెర్లిన్, టెరికాట్ షర్ట్ లు, ప్యాంట్ లు కొనిపెట్టారని తన బోటనీ రికార్డులలో బొమ్మలు వేసి ఇచ్చారని చిరంజీవి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube