ఆర్‌ నారాయణ మూర్తి ఆడియో వేడుకలో చిరు ఫస్ట్‌టైం అలా చేశాడు  

Chiranjeevi Takes Snacks At R Narayana Murthy Audio Function-marketlo Prajaswamyam Movie,r Narayana Murthy,మార్కెట్‌లో ప్రజాస్వామ్యం

మెగాస్టార్‌ చిరంజీవి ఈమద్య కాలంలో ఎక్కువ శాతం సినిమా వేడుకల్లో కనిపిస్తూ ఉన్నాడు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవరు పిలిచినా కూడా చిరంజీవి ఆ సినిమా వేడుకల్లో పాల్గొంటున్నాడు. తాజాగా పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌ నారాయణ మూర్తి నటించిన ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’ చిత్రం ఆడియో విడుదల వేడుకలో పాల్గొన్నాడు. ఆర్‌ నారాయణ మూర్తి సినిమా ఆడియో వేడుకలో చిరంజీవి పాల్గొనడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది..

ఆర్‌ నారాయణ మూర్తి ఆడియో వేడుకలో చిరు ఫస్ట్‌టైం అలా చేశాడు-Chiranjeevi Takes Snacks At R Narayana Murthy Audio Function

ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆర్‌ నారాయణ మూర్తిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ సందర్బంగా చిరు మాట్లాడుతూ. ఆర్‌ నారాయణ మూర్తికి సినిమాలంటే పిచ్చి, కమర్షియల్‌ చిత్రాల్లో మంచి పాత్రలు, భారీ పారితోషికంతో ఛాన్స్‌లు వచ్చినా కూడా తాను నమ్మిన సిద్దాంతం ప్రకారమే సినిమాలు నిర్మించాలని, నటించాలని డబ్బులను కూడా కాదన్నాడు. ఆయన సినిమాలను మాత్రమే ప్రేమిస్తాడు, సినిమాలను మాత్రమే అయన పెళ్లి చేసుకున్నాడు అంటూ కామెంట్‌ చేశాడు.

ఇక చిరంజీవి ఈ ఆడియో వేడుకలో పాల్గొనడమే కాకుండా అక్కడ ఏర్పాటు చేసిన స్నాక్స్‌ను కూడా తినడం జరిగింది. పకోడి మరియు జిలేబీలను చిరంజీవి మీడియా వారితో కలిసి తినడం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

చిరంజీవి ఏ వేడుకకు వెళ్లినా కూడా అక్కడ ఏమీ తీసుకోకుండానే కొద్ది సేపు ఉండి వస్తాడు. కాని ఈసారి మాత్రం ఆర్‌ నారాయణ మూర్తి ఏర్పాటు చేసిన స్నాక్స్‌ తినడంతో పాటు కొద్ది సమయం పాటు సరదాగా అక్కడ మీడియా వారితో మాట్లాడటంతో పాటు నారాయణ మూర్తితో సరదాగా గడిపాడు. చిరంజీవి ఇలా చేయడం ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశం అయ్యింది.