ఉయ్యాలవాడను మరిచిన సైరా.. ఎంతవరకు న్యాయం?

మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిని ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడో అందరికీ తెలిసిందే.స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశాడు.

 Chiranjeevi Sye Raa Team Forgets Uyyalawada Death Anniversary-TeluguStop.com

ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించాడు.ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

అయితే ఇంతటి సక్సెస్‌ను అందించిన ఫ్రీడం ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి చిత్ర యూనిట్ ఘోర అవమానం చేశారంటూ ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.ఫిబ్రవరి 21న ఉయ్యాలవాడ వర్ధంతి అనే విషయాన్ని చిత్ర యూనిట్ పూర్తిగా మర్చిపోయారు.

కనీసం ఆయన బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించామనే గౌరవంతో కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళులు అర్పించలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉయ్యాలవాడ సినిమాను తెరకెక్కించి సక్సెస్‌ను అందుకున్న చిరంజీవి ఇలా ఆయనకు ఘోర అవమానం చేయడం తగదు అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

ఏదేమైనా ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube