చిరు పెద్ద కూతురుకు కరోనా షాక్‌

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత మరియు ఆమె భర్త కలిసి ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించారు.

ఇటీవలే ఆ నిర్మాణ సంస్థను చిరంజీవి భార్య సురేఖ గారు పూజా కార్యక్రమాలు నిర్వహించి మొదలు పెట్టారు.

ఆ నిర్మాణ సంస్థలో ఒక వెబ్‌ సిరీస్‌ను సుష్మిత దంపతులు నిర్మిస్తున్నారు.

ప్రకాష్‌ రాజ్‌ మరియు సంపత్‌ రాజ్‌ లు కీలక పాత్రల్లో ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ జెట్‌ స్పీడ్‌తో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో కరోనా కారణంగా బ్రేక్‌ పడినది.

< సహాయ దర్శకుడు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో ఆయనతో కాంటాక్ట్‌ అయిన వారు అంతా కూడా పరీక్షకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.