వర్మని వదిలేసి యండమూరిని కడిగేసిన చిరంజీవి     2017-01-09   23:21:55  IST  Raghu V

ఖైదీనం 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎన్ని ప్రకంపనలు సృష్టించాయో మనం చూసాం. ఎప్పుడో రచయిత యండమూరి వీరేంద్రనాథ్, ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ మెగాఫ్యామిలిపై చేసిన కామెంట్స్ పై స్పందించిన నాగబాబు, చాలా ఘాటుగా, “వాడు” అని సంబోధిస్తూ ఈ ఇద్దరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

నాగబాబు కంట్రవర్సీపై స్పందించిన మెగాస్టార్ వర్మని వదిలేసి, చరణ్ మీద కామెంట్స్ చేసిన యండమూరిపై మండిపడ్డారు. వ్యక్తిత్వ వికాసం పాఠాలు చెప్పడమంటే, ఒకరిని పొగడడం కోసం మరొకరిని తిట్టడమా, అందరిలోనూ లోపాలుంటాయి, తనలో కూడా ఉన్నాయి, ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కేవలం లోపాల గురించేనా మాట్లాడేది అంటూ చిరంజీవి రియాక్ట్ అయ్యారు.

అలాగే స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు మర్యాదగా బహువచనం ఉపయోగించాలని, కాని తన భార్య సురేఖని ఏకవచనంతో పిలవడం ఎలాంటి సంస్కారం అని యండమూరిపై మండిపడ్డారు మెగాస్టార్.

అయితే వర్మపై మాత్రం ఎలాంటి ఆక్రోషాన్ని బయటపెట్టలేదు చిరంజీవి. నాగబాబు అలా స్పందించడాన్ని సపోర్టు చేసారు.