ఆచార్యలో చిరంజీవి డైలాగుకు గూస్‌బంప్స్ ఖాయం!  

Chiranjeevi Super Dialogue In Acharya, Chiranjeevi, Acharya, Koratala Siva, Kajal Aggarwal, Ram Charan - Telugu Acharya, Chiranjeevi, Kajal Aggarwal, Koratala Siva, Ram Charan

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం తరువాత నటిస్తున్న ఆచార్య చిత్రంపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తి కావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TeluguStop.com - Chiranjeevi Super Dialogue In Acharya

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో చిరంజీవి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే తెలిపింది.

TeluguStop.com - ఆచార్యలో చిరంజీవి డైలాగుకు గూస్‌బంప్స్ ఖాయం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఎండోమెంట్ ఆఫీసర్ పాత్రలో కనిపించే చిరు సామాజిక సేవలు చేసే పాత్రలో ప్రేక్షకులను కట్టపడేయనున్నాడట.ఇక ఈ సినిమాలో ఓ సీన్‌లో చిరంజీవి చెప్పే సింగిల్ టేక్ డైలాగ్ ఈ సినిమాకు మేజర్ హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది.

అంతేగాక గతంలో ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్‌తో అదిరిపోయే డైలాగ్ చెప్పించిన కొరటాల, ఈసారి చిరంజీవితో ఈ భారీ డైలాగును చెప్పించనున్నాడ.ఈ డైలాగ్‌తో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

అంతేగాక ఈ సినిమాలో కేమియో పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ కూడా అదిరిపోయే డైలాగులు చెబుతున్నట్లు తెలుస్తోంది.చిరు, చరణ్‌లు చెప్పే డైలాగులకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమా టీజర్‌ను జనవరి 29న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.మరి చిరంజీవి కోసం కొరటాల ఎలాంటి డైలాగులను రెడీ చేశాడో తెలియాలంటే ఆచార్య చిత్రం రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

కాగా ఈ సినిమాను రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

#Ram Charan #Kajal Aggarwal #Koratala Siva #Chiranjeevi #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు