సుజీత్‌కు దిమ్మతిరిగేలా చేసిన చిరు  

Chiranjeevi Sujeeth Lucifer - Telugu Chiranjeevi, Lucifer, Remake, Sujeeth, Tollywood News

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Chiranjeevi Sujeeth Lucifer

ఇక ఈ సినిమా తరువాత చిరు తన నెక్ట్స్ చిత్రంగా ఓ మలయాళ సినిమాను రీమేక్ చేసేందుకు ఒప్పుకున్నాడు.మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రామ్ చరణ్ సిద్ధమయ్యాడు.

ఈ మేరకు చిరును హీరోగా పెట్టి ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతలు యంగ్ డైరెక్టర్ సుజీత్‌కు అప్పగించారు.అయితే ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిందిగా సుజీత్‌కు చెప్పారు.

సుజీత్‌కు దిమ్మతిరిగేలా చేసిన చిరు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో లాక్‌డౌన్ సమయంలో ఈ మార్పులు చేర్పులు చేసే పనిలో పడ్డాడు సుజీత్.అయితే తాజాగా ఈ సినిమా స్క్రిప్టు పనులను పూర్తి చేసిన సుజీత్, చిరుకు దీన్ని వినిపించినట్లు తెలుస్తోంది.

అయితే పూర్తి కథ విన్న చిరు, సుజీత్ చేసిన మార్పులకు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఒరిజినల్ కథకు భారీ మార్పులు చేసిన సుజీత్, కేవలం రొటీన్ ఫార్ములాగా ఈ సినిమాను తీర్చి దిద్దినట్లు తెలుస్తోంది.

దీంతో చిరు మరోసారి స్క్రిప్టు పనులను చేపట్టాలని సుజీత్‌కు సూచించాడట.కాగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌గా తెరకెక్కించేందుకు చిరు అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.మరి ఈసారైనా సుజీత్ చిరును మెప్పించే మార్పులు చేస్తాడా లేదా చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi Sujeeth Lucifer Related Telugu News,Photos/Pics,Images..

footer-test